ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరి విద్యార్థులతో కలెక్టర్‌ భేటీ

ABN, Publish Date - Nov 30 , 2024 | 10:43 PM

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ శనివారం తన బంగ్లాలో గిరిజన విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

గిరిజన విద్యార్థులతో ముచ్చటిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష

భవిష్యత్తుపై సూచనలు చేసిన దినేశ్‌కుమార్‌

పాడేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ శనివారం తన బంగ్లాలో గిరిజన విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిరిజన విద్యార్థుల్లో మనో వికాశంతోపాటు వారికి కెరీర్‌ గైడెన్స్‌పై మరింత అవగాహన పెంచాలనే లక్ష్యంతో స్థానిక కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం బాలికలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలురతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల వృత్తులు, వారి స్థితిగతులు, జీవన విధానం, విద్యార్థులు చదువుతున్న తీరు, వారికి భవిష్యత్తుపై ఉన్న ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతంగా ఎదిగేందుకు తగ్గట్టుగా కృషి, పట్టుదలతో చదువుకోవాలన్నారు. మీరంతా ఐఏఎస్‌. ఐపీఎస్‌, డాక్టర్‌, ఇంజనీర్‌ వంటి అధికారులు కావాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి కాఫీ తాగారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్‌.రజని, టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 10:43 PM