ఇండోర్ స్టేడియం పనుల జాప్యంపై కమిషనర్ అసంతృప్తి
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:17 AM
నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పనులను వచ్చే జనవరి నాటికి పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ ఆదేశించారు.
జనవరి నాటికి పూర్తిచేయాల్సిందిగా ఆదేశాలు
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పనులను వచ్చే జనవరి నాటికి పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ ఆదేశించారు. స్టేడియంలో జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. స్టేడియం లోపల కలియతిరిగిన ఆయన పనులు జాప్యం కావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. స్టేడియంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రేక్షకులు సౌకర్యవంతంగా కూర్చొనేందుకు అవసరమైన సీట్లు, ఏసీ, లైటింగ్ సమకూర్చాలని ఆదేశించారు. టెన్నిస్ కోర్టు వృథాగా ఉండడంతో నిరంతరం నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇండోర్ స్టేడియంలో భద్రపరచిన ఎన్నికల సామగ్రిని వేరొకచోటకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను స్థానిక కార్పొరేటర్ సాడిపద్మారెడ్డి, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు కోరారు. కమిషనర్ వెంట జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, చీఫ్ ఇంజనీర్ పి.శివప్రసాదరాజు ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:17 AM