ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేజీబీవీ విద్యార్థినుల ఆందోళన

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:32 AM

మండలంలోని కిలగాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు బుధవారం ఆందోళన బాట పట్టారు. తమకు ఉడకని అన్నం, కూరలు పెడుతున్నారని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, ప్రశ్నిస్తే కొడుతున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

రహదారిపై బైటాయించి ఆందోళన చేస్తున్న విద్యార్థులు

సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయింపు

ఉడకని అన్నం, కూరలు పెడుతున్నారు

మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు

ప్రశ్నిస్తే కొడుతున్నారు

మా గోడు వినేవారే లేరంటూ బాలికల ఆవేదన

పాఠశాల ప్రత్యేక అధికారిణిని మార్చాలని డిమాండ్‌

ఎంపీడీవో, ఎస్‌ఐ సర్ది చెప్పడంతో నిరసన విరమణ

ముంచంగిపుట్టు, సెప్టెంబరు 4: మండలంలోని కిలగాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు బుధవారం ఆందోళన బాట పట్టారు. తమకు ఉడకని అన్నం, కూరలు పెడుతున్నారని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, ప్రశ్నిస్తే కొడుతున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

కిలగాడ కేజీబీవీలో కొద్ది రోజులుగా భోజన మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఉడకని అన్నం, కూరలు పెడుతున్నారని వాపోతున్నారు. మరుగుదొడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని, పాఠశాల ప్రత్యేక అధికారిణి జ్యోతి, అకౌంటెంట్‌ పుష్పవతిలు తమకొద్దంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు బాలికలు మాట్లాడుతూ సుమారు వారం రోజులుగా అధ్వానమైన భోజనం పెడుతున్నారని, మెనూపై ప్రశ్నిస్తే తమపై దురుసుగా ప్రవర్తిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం, మరుగుదొడ్ల సమస్యతో నిత్యం అవస్థలు పడుతున్నామని, తనిఖీలకు వచ్చే అధికారులు తమతో మాట్లాడకుండా, తమ సమస్యలు తెలుసుకోకుండా, ఉపాధ్యాయులతో మాట్లాడి, భోజనాలు చేసి వెళ్లిపోతున్నారని వారు ఆరోపించారు. తమ సమస్యలు వినేవారు, పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం దిక్కుతోచని పరిస్థితిలో రోడ్డెక్కాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను తల్లిదండ్రులకు చెప్పొద్దంటూ ప్రత్యేక అధికారిణి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి జ్యోతి, అకౌంటెంట్‌ పుష్పవతిలను మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో అందరం ఇళ్లకు వెళ్లిపోతామని, తమ బాధను కలెక్టర్‌కు చెబుతామని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. ప్రత్యేక అధికారిణితో పాటు ఉపాధ్యాయులు వచ్చి బాలికలను సముదాయించినా వారు ఆందోళన విరమించలేదు. సీపీఎం మండల నేతలు కె.త్రినాథ్‌, ఎం.ఎం.శ్రీనులు బాలికల ఆందోళనకు మద్దతు తెలిపారు. బాలికల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కిరణ్‌కుమార్‌, ఎస్‌ఐ రవీంద్రలు ఆందోళన చేస్తున్న బాలికలతో మాట్లాడి సర్ది చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో బాలికలు శాంతించి ఆందోళన విరమించారు. అనంతరం వారు పాఠశాలకు వెళ్లి అక్కడ నెలకొన్న సమస్యలను బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, ఎస్‌ఐలు మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక అధికారిణితో పాటు ఉపాధ్యాయులతో మాట్లాడామన్నారు. ఈ విషయంపై ప్రత్యేక అధికారిణి జ్యోతిని విలేకరులు వివరణ కోరగా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని, అప్పుడప్పుడు సరకులు రావడం ఆలస్యం అయితే చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నాయని, బాలికలను బాగానే చూసుకుంటున్నామన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

కిలగాడ కేజీబీవీలో నెలకొన్న సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(జీసీడీవో)సూర్యకుమారి తెలిపారు. బుధవారం ఆమె పాఠశాలను సందర్శించారు. ఎంపీడీవో కిరణ్‌కుమార్‌, ఎస్‌ఐ రవీంద్ర, ఎంపీపీ సీతమ్మల సమక్షంలో విచారణ చేపట్టారు. తరగతుల వారీగా బాలికలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, ప్రత్యేక అధికారిణి జ్యోతి, అకౌంటెంట్‌ పుష్పవతిలు తమకు వద్దని, మెనూపై ప్రశ్నిస్తే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఇంటి బాట పడతామని బాలికలు ఆమెకు తెలిపారు. అనంతరం ప్రత్యేక అధికారి, అకౌంటెంట్‌లతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలను త్వరగతిన పరిష్కరిస్తామని, బాలికలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు.

Updated Date - Sep 05 , 2024 | 12:32 AM

Advertising
Advertising