ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యాశాఖలో కలకలం!

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:54 AM

ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు రద్దయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖలో వైసీపీ ప్రభుత్వం సాగించిన అనేక అక్రమాలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం సిఫారుసుల ముసుగులో ఉపాధ్యాయులను ముడుపులు తీసుకొని అక్రమంగా బదిలీలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్‌ విద్యాశాఖలో అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బదిలీలను రద్దు చేశారు.

అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయం

వైసీపీ ప్రభుత్వం చేసిన అడ్డగోలు బదిలీలు రద్దు

ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

జిల్లాలో నిలిచిన 85 మంది టీచర్ల బదిలీలు

ఎవరికీ చెప్పుకోలేక మథనపడుతున్న గురువులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు రద్దయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖలో వైసీపీ ప్రభుత్వం సాగించిన అనేక అక్రమాలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం సిఫారుసుల ముసుగులో ఉపాధ్యాయులను ముడుపులు తీసుకొని అక్రమంగా బదిలీలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్‌ విద్యాశాఖలో అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బదిలీలను రద్దు చేశారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌, పాఠశాల విద్యా కమిషనర్‌ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా విద్యాశాఖలో కలకలం రేగుతోంది. 2024 ఫిబ్రవరి నుంచి 2024 మే వరకు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ ఉత్తర్వులతో రద్దయ్యాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారులు ఎన్నికల ముందు హడావుడిగా జరిపిన బదిలీల్లో మూడు విడతల్లో సుమారు 150 మందికి పైగా ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగా విశాఖ, అనకాపల్లి, ఏఎస్‌ఆర్‌ జిల్లాల నుంచి స్థాన చలనం కల్పించారు. రాజకీయ పలుకుబడి వున్న కొందరు ఉపాధ్యాయులు కావాల్సిన చోటుకు బదిలీలు చేయించుకోగలిగారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో అనకాపల్లి జిల్లాకు చెందిన సుమారు 85 మంది ఉపాధ్యాయుల బదిలీలు రద్దయ్యాయి. ఈ బదిలీల్లో ప్రతి ఉపాధ్యాయుడి నుంచి రూ.2 లక్షల నుంచి స్థానాన్ని బట్టి రూ.3 లక్షలు అంతకు మించి కూడా వసూలు చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ బదిలీల్లో అప్పట్లో విశాఖపట్నంలోని విద్యాశాఖలో కొందరు ఉద్యోగులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మంత్రిగా ఉన్న ఒక నేతపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ విధానంలోనే బదిలీలు జరపాల్సి ఉండగా గత వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టేసింది. సిఫారుసుల బదిలీల ముసుగులో వసూళ్లకు తెగబడి అడ్డగోలుగా బదిలీల ప్రక్రియ కానిచ్చేసింది. సాధారణ బదిలీల్లో అయితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని సిఫారసుల బదిలీల కోసం రూ.లక్షలు ముడుపులు చెల్లించిన ఉపాధ్యాయులు ఇప్పుడు బదిలీలు రద్దవడంతో లబోదిబోమంటున్నారు. సిఫారసులతో బదిలీలు రద్దవడంతో జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు గత ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించామని బయటకు చెప్పుకోలేక లోలోపల మథనపడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత ఏడాది బదిలీ అయిన ఉపాధ్యాయుల బదిలీలను నిలిపేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ లక్ష్మమ్మ తెలిపారు. జిల్లకు బదిలీపై వచ్చిన, ఇతర జిల్లాకు వెళ్లిన ఉపాధ్యాయులకు ఈమేరకు సమాచారం అందిచామని పేర్కొన్నారు.

బదిలీలు కౌన్సెలింగ్‌ ద్వారానే జరగాలి

ఏ ప్రభుత్వమైనా బదిలీలు కౌన్సెలింగ్‌ నిర్వహించి మాత్రమే జరపాలి. రాజకీయ పలుకుబడి, అర్ధబలం ఉన్నవారికి కావాల్సిన చోటుకు ప్రభుత్వం నేరుగా బదిలీలు చేయడం సరికాదు. అక్రమ బదిలీల వల్ల సాధారణ బదిలీలలో న్యాయంగా బదిలీ కోరుకోనే వారికి నష్టం జరుగుతుంది.

- గొంది చిన్నబ్బాయ్‌, యూటీఎఫ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - Jul 27 , 2024 | 12:54 AM

Advertising
Advertising
<