జీసీసీ అభివృద్ధికి సహకరించండి
ABN, Publish Date - Nov 22 , 2024 | 10:55 PM
గిరిజన సహకార సంస్థ సంపూర్ణ అభివృద్ధికి సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె.కన్నబాబును జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ కోరారు.
టీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శిని కోరిన జీసీసీ చైర్మన్ కిడారి
పాడేరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ సంపూర్ణ అభివృద్ధికి సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె.కన్నబాబును జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ కోరారు. అమరావతిలో శుక్రవారం టీడబ్ల్యూ కార్యదర్శి కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీసీసీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు, సంస్థలో ఉద్యోగుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శ్రావణ్‌కుమార్ కోరారు. ప్రభుత్వ సహకారంతో సంస్థను బలోపేతం చేసేందుకు తోడ్పాటునందించాలని కోరారు.
Updated Date - Nov 22 , 2024 | 10:55 PM