ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్పొరేటరా మజాకా!?

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:02 AM

అతడో వైసీపీ కార్పొరేటర్‌ భర్త. కానీ తానే కార్పొరేటర్‌గా చలామణీ అవుతుంటారు.

  • రెసిడెన్షియల్‌కు ప్లాన్‌ తీసుకుని వాణిజ్య భవన నిర్మాణం

  • పాఠశాల ఏర్పాటుకు సర్వం సిద్ధం

  • విద్యా శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పెండింగ్‌

  • చోద్యం చూస్తున్న జీవీఎంసీ అధికారులు

  • స్థలంపైనా వివాదం

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో 22ఏ నుంచి తొలగింపు

  • ప్రస్తుతం కోర్టులో ఉన్న వివాదం

  • వైసీపీ కార్పొరేటర్‌ భర్త లీలలివి...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అతడో వైసీపీ కార్పొరేటర్‌ భర్త. కానీ తానే కార్పొరేటర్‌గా చలామణీ అవుతుంటారు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా (22ఏ) ఉన్న 830 గజాల భూమిని వైసీపీ హయాంలో తన పరం చేసుకున్నారు. రెండు వేర్వేరు భవనాల నిర్మాణానికి (రెసిడెన్షియల్‌) జీవీఎంసీ నుంచి ప్లాన్‌ తీసుకున్నారు. ఒక భవనాన్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనంలో పాఠశాల ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందినప్పటికీ కార్పొరేటర్‌ భర్త కావడంతో చర్యలకు సాహసించలేకపోతున్నారు.

జీవీఎంసీ 16వ వార్డు కృష్ణా కాలేజీ వెనుక 830 గజాల్లో నిర్మించిన మరో వార్డు కార్పొరేటర్‌, ఆమె భర్త భారీ భవన నిర్మాణం వివాదాస్పదమవుతోంది. టౌన్‌ సర్వేనంబరు 49/4లో 415 చదరపు గజాల స్థలంలో నివాసయోగ్యమైన జీ+3 భవన నిర్మాణం, దానికి ఆనుకున్న ఉన్న మరో 415 చదరపు గజాల్లో నివాసానికి జీ+3 భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కార్పొరేటర్‌ పేరుతో ఒక దరఖాస్తు, కార్పొరేటర్‌ భర్త పేరుతో మరొక దరఖాస్తు అందాయి. జీవీఎంసీ జారీచేసిన ప్లాన్‌ ప్రకారం రెండు వేర్వేరు భవనాలను నిర్మించాల్సి ఉంది. ప్లాన్‌లో నిర్దేశించిన ప్రకారం భవనాల చుట్టూ సెట్‌ బ్యాక్స్‌ విడిచిపెట్టాలి. కానీ 20 అడుగులు కూడా లేని రోడ్డులో రెండు ప్లాన్‌లను కలిపేసి ఒకే భవనం నిర్మించేశారు. నివాసానికి యోగ్యంగా భవన నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ, వాణిజ్య అవసరాలకు అనువుగా తీర్చిదిద్దారు. రెండు భవనాలకు వేర్వేరుగా కాకుండా ఒకే మెట్లు నిర్మించారు. పైగా భవనాలకు సెట్‌బ్యాక్‌లను విడిచిపెట్టలేదు. నిర్మాణం చేపట్టిన స్థలం గతంలో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డు నమోదై ఉండేది. వైసీపీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా పనిచేసిన ముఖ్య నేత ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి 22ఏ జాబితా నుంచి తొలగించేశారు. దీనిపై కొందరు రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నాడు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ కావడంతో చర్యలకు వెనకడుగువేశారు. 22ఏ నుంచి తొలగించిన వెంటనే భవన నిర్మాణానికి ఆగమేఘాలపై జీవీఎంసీ అధికారులు ప్లాన్‌ జారీచేసేశారు. ఆ స్థలానికి వీఎల్‌టీ చెల్లించాల్సి ఉందని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జీవీఎంసీ అధికారులు వీఎల్‌టీ చెల్లించాలంటూ కార్పొరేటర్‌ భర్తపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన మరో ముఖ్యనేత ద్వారా జీవీఎంసీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి వీఎల్‌టీ కూడా లేకుండా చేసుకున్నారు.

పాఠశాల ఏర్పాటుకు రంగం సిద్ధం

దీనిపై ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో చేజిక్కించుకున్నారంటూ కొంతమంది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. తమ పార్టీ అధికారంలో ఉండగా అధికార బలంతో అక్రమాలను సక్రమం చేసుకుని, భవన నిర్మాణం పూర్తిచేసిన కార్పొరేటర్‌ భర్త ఆ భవనంలో పాఠశాల ప్రారంభించేందుకు సర్వంసిద్ధం చేసుకున్నారు. అయితే విద్యాశాఖ నుంచి అనుమతులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇంతలో ప్రభుత్వం మారిపోవడంతో టీడీపీలో చేరేందుకు సర్వవిధాలా యత్నించారు. కానీ వార్డులోని ఆ పార్టీ నేతలు అడ్డుపడడంతో వీలు కాలేదు. విద్యా శాఖ అధికారుల నుంచి పాఠశాల ప్రారంభానికి అనుమతి రాకపోవడంతో భవనం పెండింగ్‌లో ఉండిపోయింది. దీనిపై కోర్టులో కేసు వేసిన వారు జీవీఎంసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడడంతో ఆ భవనంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయం జోన్‌-3 ఏసీపీ మధుసూదనరావు వద్ద ప్రస్తావించగా తాను ఇటీవల బాధ్యతలు స్వీకరించానని, ఆ భవనం విషయం తెలియదన్నారు. ఒకటి, రెండు రోజుల్లో భవనం ఫైల్‌ తెప్పించుకుని, సమగ్రంగా పరిశీలించిన తర్వాత అక్రమ నిర్మాణమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:02 AM