రేషన్‌పై కందిపప్పు
ABN, Publish Date - Oct 03 , 2024 | 01:29 AM
దసరా పండుగ నేపథ్యంలో జిల్లాలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 5,47,312 కుటుంబాలకు కిలో రూ.67 చొప్పున పంపిణీ చేయడానికి 547 టన్నుల కందిపప్పు అవసరమని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారులు గత నెలలోనే ఇండెట్ పెట్టారు.
ఒక్కో కార్డుకు కిలో చొప్పున పంపిణీ
తొలివిడతలో జిల్లాకు 180 టన్నులు కేటాయింపు
ముందుగా పట్టణ ప్రాంతాల్లో సరఫరా
అనకాపల్లి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ నేపథ్యంలో జిల్లాలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 5,47,312 కుటుంబాలకు కిలో రూ.67 చొప్పున పంపిణీ చేయడానికి 547 టన్నుల కందిపప్పు అవసరమని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారులు గత నెలలోనే ఇండెట్ పెట్టారు. ఇప్పటికే 180 టన్నుల కందిపప్పు జిల్లాకు కేటాయించిందని, ఇందులో 50 టన్నుల కందిపప్పు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ గోదాములకు చేరాయని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కేఎస్ మూర్తి తెలిపారు. తొలుత పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలకు కందిపప్పు కేటాయించి ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు అందజేస్తామని తెలిపారు. జిల్లాకు కేటాయించిన మిగిలిన కందిపప్పు రాగానే అంగన్‌వాడీ కేంద్రాలకు, గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.
Updated Date - Oct 03 , 2024 | 07:20 AM