ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విరగ్గాసిన మిరియాలు

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:32 PM

మన్యంలో ఈ ఏడాది మిరియాలు విరగ్గాశాయి. వర్షాలు అనుకూలించడంతో మిరియాల పంట ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు. దీంతో కాఫీ తోటల్లో ఎక్కడ చూసినా సిల్వర్‌ ఓక్‌ చెట్ల పాదాలకు గుత్తులుగా మిరియాలు దర్శనమిస్తున్నాయి.

గుత్తులుగా ఉన్న మిరియాలు

మన్యంలో ఆశాజనకంగా పంట

ఫిబ్రవరి నెలాఖరు నుంచి కోతలు

మార్చి, ఏప్రిల్‌లో వారపు సంతల్లో క్రయవిక్రయాలు

ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 70 వేల ఎకరాల కాఫీ తోటల్లో మిరియాల పాదులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో ఈ ఏడాది మిరియాలు విరగ్గాశాయి. వర్షాలు అనుకూలించడంతో మిరియాల పంట ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు. దీంతో కాఫీ తోటల్లో ఎక్కడ చూసినా సిల్వర్‌ ఓక్‌ చెట్ల పాదాలకు గుత్తులుగా మిరియాలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీలోని కాఫీ తోటల్లో కాఫీ పండ్లు విరగ్గాయగా, వాటికి నీడ కోసం పెంచుతున్న సిల్వర్‌ఓక్‌ చెట్లకు మిరియాల పాదులు అల్లుకుని గుత్తులుగా మిరియాలు కాశాయి.

ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటలుంటే, వాటిలో సుమారుగా 70 వేల ఎకరాల్లోని తోటల్లో మిరియాల పాదులున్నాయని ఒక అంచనా. కాఫీ రైతుల ఆసక్తి మేరకు తమ తోటల్లోని పొడుగ్గా ఉండే సిల్వర్‌ ఓక్‌ మొక్కలకు మిరియాలు పాదులను అల్లిస్తుంటారు. దీంతో ఒక్కో చెట్టుకు అల్లిన పాదుల ద్వారా ఏడాదికి 25 నుంచి 30 కిలోల పచ్చి మిరియాలు దిగుబడి వస్తుంది. దీంతో కాఫీ రైతులకు మిరియాలు అంతర పంటగా అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు సైతం మిరియాల రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతోపాటు రాయితీపై మిరియాలు వలిచే యంత్రాలు, ప్లాస్టిక్‌ టార్పలిన్లు అందిస్తున్నది. దీంతో ఏజెన్సీలో మిరియాల పంటపై గిరిజన రైతులు ఆసక్తి చూపడంతోపాటు ప్రతి ఏడాది విస్తీర్ణం సైతం పెరుగుతున్నది.

ఫిబ్రవరి నెలాఖరు నుంచి కోతలు

ఏజెన్సీలో ప్రస్తుతం మిరియాల పంట ఆశాజనకంగా ఉండగా, రైతులు ఫిబ్రవరి నెలాఖరు నుంచి కోతలు ప్రారంభిస్తారు. కోసిన వాటిని ఎండబెట్టి, శుద్ధి చేసి మార్చి నెల నుంచి వారపు సంతల్లో విక్రయిస్తారు. సుమారుగా నెలన్నర రోజులు ఏజెన్సీ వారపు సంతల్లో, గ్రామాల్లో మిరియాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అలాగే మిరియాలకు సైతం నిత్యం డిమాండ్‌ ఉండడంతో ధర సైతం దిగజారే పరిస్థితి తక్కువ. గతేడాది మార్కెట్‌ సీజన్‌ ప్రారంభంలో కిలో ధర రూ.400 కాగా, సీజన్‌ ముగిసే నాటికి రూ.550 వరకు పెరిగింది. దీంతో కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు పండించే గిరిజన రైతులకు అదనపు ఆదాయాన్ని మిరియాలు సమకూరుస్తున్నాయి.

Updated Date - Dec 02 , 2024 | 11:32 PM