ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కిక్కిరిసిన రైతుబజార్లు

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:36 AM

బహిరంగ విపణిలో ఉల్లి, టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో నగర వాసులు రైతుబజార్ల వైపు పరుగుతీస్తున్నారు.

ఉల్లి, టమాటా కోసం బారులుతీరిన వినియోగదారులు

ఎంవీపీ రైతుబజారులో ఎనిమిది కౌంటర్లలో విక్రయం

క్యూలో గంటలకొద్దీ వేచి ఉన్న జనం

మిగిలిన రైతు బజార్లలోనూ అదే పరిస్థితి

ఎంవీపీ కాలనీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):

బహిరంగ విపణిలో ఉల్లి, టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో నగర వాసులు రైతుబజార్ల వైపు పరుగుతీస్తున్నారు. సెలవు రోజు కావడంతో ఆదివారం ఎంవీపీ కాలనీ రైతుబజారు జనంతో కిక్కిరిసిపోయింది. ఉల్లి, టమాటా కొనుగోలుకు పెద్దఎత్తున బారులు తీరారు. వారిని నియంత్రించడం రైతులు, రైతుబజారు సిబ్బందికి సాధ్యం కాలేదు. జనం రద్దీ దృష్ట్యా రైతు బజారులో ఉల్లి, టమాటా విక్రయాలకు ఎనిమిదేసి కౌంటర్లు ఏర్పాటుచేసినా రద్దీ తగ్గలేదు. ఆదివారం ఒక్కరోజూ ఎనిమిదిన్నర టన్నుల చొప్పున విక్రయాలు చేపట్టిన సిబ్బంది, ఎవరికి ఎంత కావాలో అంత సరకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో మహారాష్ట్ర ఉల్లి కిలో రూ.70 నుంచి 80 ధర వరకూ పలుకుతుండగా రైతుబజారులో రూ.53 చొప్పున విక్రయిస్తున్నారు. కర్నూలు ఉల్లి రూ.37కు అందుబాటులో ఉంది. అదేవిధంగా టమాటా బహిరంగ మార్కెట్లో కిలో రూ.70 నుంచి 90 వరకూ అమ్ముతుండగా, రైతుబజారులో రూ.47కే అందిస్తున్నారు. కాగా కొందరువ్యాపారులు రైతుబజారులో సరకు కొనుగోలుచేసి, బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. దీంతో దీంతో గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో కూడా ఉల్లి, టమాటా అందుబాటులో ఉంటుందని, సెలవు రోజుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోందని ఎంవీపీ కాలనీ రైతుబజారు ఎస్టేట్‌ అధికారి ప్రసాద్‌ తెలిపారు. కాగా నగరంలోని మిగిలిన రైతుబజార్లలోనూ ఉల్లి, టమాటా కొనుగోలుకు వినియోగదారులు భారీగా బారులుతీరారు.

Updated Date - Oct 21 , 2024 | 12:36 AM