ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎస్‌ఆర్‌ నిధులు స్వాహా

ABN, Publish Date - Nov 23 , 2024 | 12:43 AM

కాదేదీ స్వాహాకు అనర్హం అన్న చందంగా వుంది గత వైసీపీ పాలకులు, ఆ పార్టీ నాయకుల తీరు. సామాజిక బాధ్యత కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పొరేట్‌ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చిన సీఎస్‌ఆర్‌ నిధులను సైతం వదల్లేదు. అభివృద్ధి పనుల పేరుతో నిధులు మంజూరు చేయించి, వైసీపీ నాయకులు, సర్పంచుల పేర్లతో నామినేషన్‌ విధానంపై పనులు చేపట్టినట్టు రికార్డుల్లో చూపి, పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఏషియన్‌ పెయింట్స్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో శారదా నది గట్టుకు ఆనుకుని నిర్మించిన సీసీ రిటైనింగ్‌ వాల్‌ కొట్టుకొనిపోవడంతో ఇసుక బస్తాలు వేసి, కర్రలను ఊతంగా పెట్టిన దృశ్యం

వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యయం

గణపర్తి గ్రామం వద్ద శారదా నది గట్టు పటిష్టతకు ఏషియన్‌ పెయింట్స్‌ సాయం

రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.2.71 కోట్లు మంజూరు

టెండర్లు పిలవకుండా సర్పంచుల పేర్లతో అస్మదీయులకు అప్పగింత

నాణ్యతాలోపంతో అరకొరగా పనులు

వరద ఉధృతికి కొట్టుకుపోయిన కట్టడాలు

ఎంపీ నిధులు మరో రూ.30 లక్షలు కూడా వరదార్పణం

కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్‌

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

కాదేదీ స్వాహాకు అనర్హం అన్న చందంగా వుంది గత వైసీపీ పాలకులు, ఆ పార్టీ నాయకుల తీరు. సామాజిక బాధ్యత కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పొరేట్‌ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చిన సీఎస్‌ఆర్‌ నిధులను సైతం వదల్లేదు. అభివృద్ధి పనుల పేరుతో నిధులు మంజూరు చేయించి, వైసీపీ నాయకులు, సర్పంచుల పేర్లతో నామినేషన్‌ విధానంపై పనులు చేపట్టినట్టు రికార్డుల్లో చూపి, పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎలమంచిలి నియోజకవర్గంంలోని అచ్యుతాపురం, రాంబిల్లి, పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ మండలాల్లో అనేక భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమలు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ప్రతి ఏటా వచ్చే నికర లాభాల్లో రెండు శాతం సొమ్మును పరిసర గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయించాలి. ఈ నిధులతో సామాజిక, ఆర్థిక, పర్యావరణ సంబంధిత పనులు చేపట్టవచ్చు. సీఎస్‌ఆర్‌ నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి దానిలో జమ చేయాలి. ఈ నిధులను కలెక్టర్‌ పర్యవేక్షణలో విద్య, వైద్య రంగాలు, రహదారుల నిర్మాణం, రక్షిత తాగునీరు, సాగునీటి వనరుల అభివృద్ధి, సామాజిక భవనాల నిర్మాణం, తదితర వాటికి వినియోగించాలి.

రూ.2.71 కోట్లు శారదా నది వరదపాలు

ఇదిలావుండగా మునగపాక మండలం గణపర్తి గ్రామం వద్ద శారదా నది ఎడమ గట్టు బలహీనంగా వుంది. నదిలో వరద ఉధృతి పెరిగితే గట్టుకు గండిపడి సమీపంలోని గణపర్తి, చూచుకొండ, మెలిపాక గ్రామాలు ముంపునకు గురవుతాయి. వందలాది ఎకరాలు నీటమునుగుతాయి. శారదా నది గట్టు పటిష్టత, రెండుచోట్ల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి స్థానిక రైతుల అభ్యర్థన మేరకు 2022లో అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లోని ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధులు రూ.2.71 కోట్లు కేటాయించింది. ఈ పనులకు టెండర్లు పిలవకుండా స్థానిక వైసీపీ నేతలు ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించారు. కాసులకు కక్కుర్తిపడి.. నాణ్యత లేకుండా పనులు చేపట్టారు. దీంతో మరుసటి ఏడాది వరద ఉధృతికి రిటైనింగ్‌ వాల్‌ నదిలోకి కూలిపోయింది. పనులు పూర్తికాకుండానే రిటైనింగ్‌ వాల్‌ కొట్టుకుపోవడంతో ఇసుక బస్తాలను అడ్డంగా వేసి మమ అనిపించారు.

గణపర్తి గ్రామ పరిధిలో శారదా నది ఎడమ గట్టు వైపు డైవర్షన్‌ వాల్‌ పనుల కోసం అదే ఏడాది అనకాపల్లి గత ఎంపీ నిధులు రూ.30 లక్షలు కేటాయించారు. డైవర్షన్‌ వాల్‌ ద్వారా గణపర్తి, చూచుకొండ పరిసరాల్లో సుమారు 1,200 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. దీంతోపాటు గట్టుపై మొక్కలు పెంచాలని నిర్ణయిచాఆరు. ఇక్కడ పనులు చేశారో లేదో తెలియదుగానీ ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి నిర్మాణ పనులు కనిపించడం లేదు. డైవర్షన్‌ వాల్‌ నదిలో కొట్టుకుపోవడంతో ఇసుక బస్తాలు వేసి, అవి జారిపోకుండా కర్రలను ఊతంగా పెట్టారు. ఈ రెండు పనులకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో వున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కానరావడంలేదు. సీఎస్‌ఆర్‌ నిధులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కనిపించని బోర్డులు

వాస్తవానికి సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఆయా పనులు చేపట్టిన ప్రదేశాల్లో నిధులు ఏ కంపెనీ కేటాయించింది, పని అంచనా విలువ ఎంత, ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఎటువంటి పనులు చేపట్టారు తదితర వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ గణపర్తి వద్ద శారదా నది ఎడమ గట్టు రిటైనింగ్‌ వాల్‌, డైవర్షన్‌ వాల్‌ పనులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయలేదు. అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసి, ఆవిష్కరించిన శిలాఫలకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. శిలాఫలకాలపై పని అంచనా విలువ ఎంత అన్నది మాత్రమే వుంది.

నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి

వాస్తవానికి కంపెనీలు, పరిశ్రమలు సామాజిక బాధ్యత కింద కేటాయించే నిధులతో జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో సంబంధిత శాఖల ఇంజనీరింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో పనులు జరగాలి. కానీ ఎస్‌ఈజడ్‌లోని ఏషియన్‌ పెయింట్స్‌తోపాటు వివిధ ఫార్మా కంపెనీలు ఇచ్చిన సీఎస్‌ఆర్‌ నిధులను వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా స్వాహా చేశారు. స్థానిక సర్పంచుల పేరుతో నామినేషన్‌ విధానంలో పనులు చేపట్టినట్టు రికార్డుల్లో చూపి నిధులను స్వాహా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ హయాంలో జిల్లాలో సీఎస్‌ఆర్‌ నిధుల వ్యయంపై విచారణ జరపాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:43 AM