ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:07 AM

రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లంకెలపాలెం రైల్వే గేటు వద్ద గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. దీనికి సంబంధించి దువ్వాడ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

కొయ్యూరు, నవంబరు 14: మండలంలోని బకులూరు గ్రామ శివారు జీడిమామిడి తోటల్లో గురువారం అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. అనంతరం కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కిశోర్‌వర్మ, పోలీసు సిబ్బంది కలసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహంపై కప్పిన జీడిమామిడి కొమ్మలు తొలగించి చూసిన పోలీసులు.. గూడెంకొత్తవీధి మండలం ఎర్ర చెరువులు గ్రామానికి చెందిన బూసరి ధనుంజయ్‌దిగా గుర్తించారు. మృతదేహం ఉబ్బిపోయి దుర్వాసన వస్తుండడంతో మూడు, నాలుగు రోజుల క్రితం ఇతను మృతిచెందడం లేదా హత్యకు గురికావడం జరిగి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎర్రచెరువులు గ్రామానికి చెందిన బూసరి లక్ష్మయ్య కుమార్తె మాధవి, బకులూరుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈమె తమ్ముడు అయిన ధనుంజయ్‌ అక్కను చూసేందుకు వారం రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. మద్యపానం అలవాటు వున్న ధనుంజయ్‌ 12వ తేదీ రాత్రి పది గంటల సమయంలో అక్క ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఈ నేపథ్యంలో గురువారం జీడిమామిడి తోటల్లో శవమై కనిపించాడు. ధనుంజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు.

.

రైలు ఢీకొని ఒకరి మృతి

లంకెలపాలెం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లంకెలపాలెం రైల్వే గేటు వద్ద గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. దీనికి సంబంధించి దువ్వాడ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. కంచరపాలెం ప్రాంతానికి చెందిన రొక్కం శేషగిరిరావు(50) స్థానిక కూడలిలో గల ఓ హోటల్‌లో పనిచేస్తూ స్థానికంగా నివాసముంటున్నాడు. ఉదయం లంకెలపాలెం నుంచి జాతీయ రహదారి కూడలికి నడిచి వచ్చే క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాద స్థలాన్ని దువ్వాడ జీఆర్పీ పోలీసులు పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన వృద్ధుడు మృతి

అనకాపల్లి టౌన్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బుధవారం తెల్లవారుజామున అదృశ్యమైన వృద్ధుడు మృతి చెందాడని, దీనిపై గురువారం అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక నరసింగరావుపేట దుర్గాలాడ్జి వీధిలో ఉంటున్న అద్దంకి శ్రీనివాసరావు(72) బుధవారం తెల్లవారుజామున అదృశ్యమైన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు గురువారం వెతుకుతుండగా చినబాబుకాలనీలోని జీవీఎంసీ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం సమీపంలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించారని ఎస్‌ఐ తెలిపారు. ఆయన కుమారుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

అదృశ్యమైన పోస్టల్‌ ఉద్యోగి మృతి

దేవరాపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలపూడిలో బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్న దాసరి సత్య ప్రవీణ్‌ (28) రైవాడ జలాశయంలో శవమై తేలాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ సత్యప్రవీణ్‌ తండ్రి లోవరాజు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రైవాడ జలాశయంలో మృతదేహం తేలినట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతిచెందిన వ్యక్తి సత్యప్రవీణ్‌గా నిర్ధారించారు. జలాశయాన్ని చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయి మృతిచెంది వుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మాడుగుల రూరల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఎం.కోడూరు గ్రామానికి చెందిన పడాల నరేంద్ర (30) బుధవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఎస్‌ఐ నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం.. పడాల నరేంద్ర ఎం.కోడూరులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్నేహితునితో కలిసి బైక్‌పై వీరనారాయణం నుంచి గాదిరాయి వెళుతూ మూత్రవిసర్జన కోసం దారిలో ఆగారు. అక్కడ తెగిపడి వున్న విద్యుత్‌ తీగను నరేంద్ర గమనించలేదు. చీకటిగా వుండడంతో కరెంటు తీగ కాలికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. నరేంద్ర తల్లి కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

పోసానిపై నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు

నర్సీపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరిడయ్య గురువారం నర్సీపట్నం సీఐ గోవిందరావుకు ఫిర్యాదు చేశారు. పోసాని వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ దూరమని, కుట్ర పూరితమని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబునాయుడు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లపై పోసాని ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పోసానిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరిడయ్య కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

Updated Date - Nov 15 , 2024 | 01:07 AM