పాత కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి
ABN, Publish Date - Jun 10 , 2024 | 11:50 PM
స్థానిక నెహ్రూచౌక్‌కు సమీపంలోని పాత కోర్టు భవనాన్ని అనకాపల్లి జిల్లా జడ్జి ఎన్. శ్రీవిద్య సోమవారం పరిశీలించారు.
అనకాపల్లి టౌన్, జూన్ 10: స్థానిక నెహ్రూచౌక్‌కు సమీపంలోని పాత కోర్టు భవనాన్ని అనకాపల్లి జిల్లా జడ్జి ఎన్. శ్రీవిద్య సోమవారం పరిశీలించారు. భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి అవకాశం ఉందా? లేదా? అంశంపై అధికారు లతో చర్చించారు. సాధ్యమైనంత వరకు పాత కోర్టు భవనాన్ని వినియోగంలోకి తీసుకు వస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడ కుండా ఉంటుందనే ఉద్దేశంతో అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజేవీఎన్ కుమార్, కమిటీ సభ్యులు జీవీఎంసీ వారి సహకారంతో భవనాన్ని శుభ్రం చేయించారు. అధికారులతో మాట్లాడి మరోసారి జిల్లా జడ్జి పరిశీలిస్తారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ తెలిపారు. జిల్లా జడ్జి వెంట అసోసియేషన్ ప్రతినిధులు దుర్గారావు, రోజా, కె. కుసుమ, గేదెల రామచంద్రరావు, సాయిరామ్ ప్రభాకర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 10 , 2024 | 11:50 PM