బాలుడికి తప్పని డోలీమోత
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:08 AM
మండలంలోని మారుమూల కొత్తూరు పంచాయతీ బూసిపాడు గ్రామానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రి తరలించేందుకు డోలీమోత తప్పలేదు. బూసిపాడు గ్రామానికి చెందిన పేరంగి జానిబాబు (12) శనివారం స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళదామంటే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బూసిపాడు నుంచి కరివేసు వరకు సుమారు మూడు కిలో మీటర్ల మేర డోలీలో మోసుకొచ్చారు.
- మూడు కిలో మీటర్ల మేర మోసుకెళ్లిన వైనం
అనంతగిరి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల కొత్తూరు పంచాయతీ బూసిపాడు గ్రామానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రి తరలించేందుకు డోలీమోత తప్పలేదు. బూసిపాడు గ్రామానికి చెందిన పేరంగి జానిబాబు (12) శనివారం స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళదామంటే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బూసిపాడు నుంచి కరివేసు వరకు సుమారు మూడు కిలో మీటర్ల మేర డోలీలో మోసుకొచ్చారు. అక్కడ నుంచి ఆటోలో ఎస్.కోట ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కృష్ణపురం నుంచి బూసిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం నిమిత్తం జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.44 లక్షలు మంజూరయ్యాయి. అయితే రైలు పట్టాలు ఉండడంతో పనులు జరగలేదు. అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - Nov 17 , 2024 | 01:08 AM