ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:27 PM

మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని విద్యార్థులకు ఎస్పీ తుహిన్‌ సిన్హా సూచించారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలను తెలియజేయడానికి సంకల్పం కార్యక్రమం నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

ఎస్పీ తుహిన్‌ సిన్హా

నర్సీపట్నం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని విద్యార్థులకు ఎస్పీ తుహిన్‌ సిన్హా సూచించారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలను తెలియజేయడానికి సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒకసారే కదా అని మాదక ద్రవ్యాలు తీసుకుంటే, వాటికి బానిసలు కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న నర్సీపట్నంలో గంజాయి రవాణా, వినియోగం ఎక్కువగా ఉందన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు గంజాయి సేవించడంతో పాటు రవాణాకి పాల్పడుతుండడం బాధాకరమని తెలిపారు. గంజాయితో పోలీసులకు పట్టుబడితే గరిష్ఠంగా 20 సంత్సరాలు జైలుశిక్ష పడుతుందన్నారు. నేరస్థులుగా మారిన యువతపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఉద్యోగంలో చేరినా, విదేశాలకు వెళ్లాలనుకున్నా పోలీసుల వెరిఫికేషన్‌లో పాత నేరస్థులని తేలితే ఉద్యోగం కోల్పోతారని తెలిపారు. బి స్మార్ట్‌, డోన్ట్‌ స్టార్ట్‌ అని విద్యార్థులతో నినాదాలు చేయించారు. మాదక ద్రవ్యాలు వినియోగించేవారు, అమ్మేవారు, సరఫరా చేసే వారి సమాచారం 9392918196 ఫోన్‌ నంబరుకి ఇవ్వాలని కోరారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డౌనూరు చెక్‌ పోస్టు, పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీఆర్‌ఆర్‌.మోహన్‌, సీఐలు గోవిందరావు, రేవతమ్మ, డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌ఎస్‌.కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:27 PM