ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేటలో రూ.కోటితో డ్రైన్లు

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:24 AM

పాయకరావుపేటలో మురుగునీటి పారుదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కోటి రూపాయలతో డ్రైనేజీ కాలువలు నిర్మించనున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.

మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

హోం మంత్రి వి.అనిత

రూ.95 లక్షలతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన

పాయకరావుపేట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

పాయకరావుపేటలో మురుగునీటి పారుదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కోటి రూపాయలతో డ్రైనేజీ కాలువలు నిర్మించనున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. స్థానిక రాజుగారిబీడులో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం నిధులు రూ.95 లక్షలతో ఏర్పాటుచేయనున్న 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంగత వాటర్‌ ట్యాంను నిర్మాణ పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుండడంతోపాటు గత ప్రభుత్వం వదిలివేసిన అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఇక్కడ వాటర్‌ ట్యాంకు నిర్మాణంతోపాటు ఇంటింటికీ కొళాయిల ఏర్పాటు పూర్తయితే సుమారు 1,500 కుటుంబాలకు తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఆనందరావు, ఎంపీడీఓ ఎ.ప్రకాశరావు, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి, కూటమి పార్టీల నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు, పెదిరెడ్డి శ్రీను, బోడపాటి శివదత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:24 AM