ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు దేవదాయ శాఖా మంత్రి ఆనం రాక

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:15 AM

రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం నగరానికి రానున్నారు.

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం నగరానికి రానున్నారు. ఉదయం విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి విశాఖ చేరుకుంటారు. నగరంలో సంపత్‌ వినాయకుని దర్శించుకున్న అనంతరం విజయనగరం వెళ్లి సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్యపై చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజుతో చర్చిస్తారు. ఆ తరువాత నగరానికి వచ్చి కనకమహాలక్ష్మి అమ్మవారిని, సింహాచలం వరాహ నరసింహస్వామిని దర్శించుకుని రాత్రికి విమానంలో విజయవాడ వెళతారు.

--------------------------------------------------------------------------------

మెడికల్‌ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలు అవశ్యం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మెడ్‌టెక్‌ జోన్‌ వేదికగా నిలిచిందని సీఈవో జితేంద్రశర్మ

ముగిసిన వరల్డ్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌ ఫోరం-2024 సదస్సు

ఉక్కుటౌన్‌షిప్‌ (విశాఖపట్నం), డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):

మెడికల్‌ టెక్నాలజీ పురోగతిలో కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మెడ్‌టెక్‌ జోన్‌ వేదికగా నిలిచిందని సీఈవో జితేంద్రశర్మ అన్నారు. నగర పరిధిలో గల మెడ్‌టెక్‌ జోన్‌లో మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌ ఫోరం-2024 సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తూ మెడికల్‌ టెక్నాలజీలో నిత్యం నూతన ఆవిష్కరణలు జరగాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం చాలా ముఖ్యమన్నారు. గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ డెలివరీలు, ఇన్నోవేషన్‌, స్కేలింగ్‌ వంటి రంగాలపై దృష్టిసారించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన సంస్థలు పాల్గొన్న ఈ సదస్సులో 50 ఎంవోయూలు జరిగాయి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి పలు వ్యూహాలు ఆవిష్కరించారు.

--------------------------------------------------------------------------------

పెరిగిన చలి

శివారు ప్రాంతాల్లో మరింత అధికం

ఎయిర్‌పోర్టులో 18 డిగ్రీలు నమోదు

పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రెండు రోజులుగా చలి పెరిగింది. మంచు కూడా ఎక్కువ కురుస్తోంది. నగరం కంటే శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. విశాఖ ఎయిర్‌పోర్టులో శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదుకాగా, శనివారం 18 డిగ్రీలకు పడిపోయింది. శనివారం ఉదయం ఎయిర్‌పోర్టులో గాలిలో తేమ శాతం 100గా నమోదైంది. మంచు కారణంగా ఎయిర్‌పోర్టులో రన్‌వే విజుబిలిటీ 2000 మీటర్లకు పడిపోయింది. దీంతో బెంగళూరు-విశాఖ-బెంగళూరు, హైదరాబాద్‌-విశాఖ-హైదరాబాద్‌, చెన్నై-విశాఖ-చెన్నై ఇండిగో సర్వీస్‌లు, ఢిల్లీ-విశాఖ-పోర్ట్‌ బ్లెయిర్‌...ఎయిర్‌ ఇండియా సర్వీస్‌లు ఆలస్యంగా వచ్చాయి. ఆదివారం కూడా చలి కొనసాగుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు అటుఇటుగా నమోదవుతుందని, పొగమంచు కురుస్తుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

కాగా మధ్య భారతం నుంచి చలిగాలులు ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వైపు వీస్తున్నాయి. ఇంకా ఆకాశం నిర్మలంగా ఉండడంతో పొడి వాతావరణం నెలకొంది. దీంతో చలి పెరిగి కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణ నిపుణుడు తెలిపారు. సాధారణంగా కార్తీక మాసం అంటే నవంబరు రెండో వారం నుంచి చలి మొదలుకావాలి. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్‌లుగా బలపడడం, ఈశాన్య రుతుపవనాలు బలంగా ఉండడం, వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగడం వంటి కారణాలతో ఈ సీజన్‌లో దాదాపు నెల రోజులు ఆలస్యంగా చలి ప్రారంభమైంది. రెండు, మూడు రోజులు కొనసాగి మళ్లీ కాస్త తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 01:15 AM