ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్సాహంగా ‘ఇది మంచి ప్రభుత్వం’

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:58 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

  • జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లోనూ ప్రారంభం

  • వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన పనులను, అమలు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించిన కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. నియోజక వర్గాల్లో వారం రోజుల పాటు కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. తొలిరోజు అన్ని నియోజక వర్గాల్లో ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాన్ని ఇంటింటికీ అందజేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఆరిలోవలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు కూటమి నేతలు కోరాడ రాజబాబు, పంచకర్ల సందీప్‌, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని నెహ్రూ బజార్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. వంద రోజుల పాలనలో చేసిన మంచిని, చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ‘ఇది మంచి ప్రభుత్వం’ ఉద్దేశమన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 45వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పశ్చిమ నియోజకవర్గంలోని ఏకేసీ కాలనీలో ఎమ్మెల్యే గణబాబు, పెందుర్తి నియోజకవర్గం ముదపాకలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:58 AM