ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యాటక ప్రాంతాల్లో ఉత్సవాలు

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:48 PM

జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌

ప్రతిపాదనలు రూపొందించండి

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రదేశాల్లో, వారపు సంతల్లోనూ ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని, అందుకు ఐటీడీఏ పీవోలు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అరకులోయ, మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యాటక ఉత్సవాల నిర్వహణకు అధికారులు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఆయా ఉత్సవాల ద్వారా పర్యాటకుల్ని మరింతగా ఆకర్షించేలా ఉండాలన్నారు. పర్యాటక ఉత్సవాల నిర్వహణకు క్యాలెండర్‌ రూపొందించాలని, జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేయాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు పర్యాటకం, హస్తకళలపై అవసరమైన స్వయం ఉపాధి శిక్షణలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. పర్యాటకం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కలిగేలా చూడాలని, ఏజెన్సీకి వచ్చే పర్యాటకుల వివరాలను నమోదు చేయాలన్నారు. పర్యాటక ప్రదేశాల్లో సాహస క్రీడలు ఏర్పాటు చేయాలని, ఈ క్రమంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా గ్రామసభల ఆమోదం పొందాలన్నారు. అలాగే పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక పంచాయతీలకు కేటాయించాలని కలెక్టర్‌ సూచించారు. వారపు సంతల్లో నకిలీ వస్తువుల విక్రయాలను అరికట్టాలని, పర్యాటక ప్రాంతాల్లో, సంతల్లో స్వయం సహాయక సంఘాలతో దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, (వర్చువల్‌గా ఐటీడీఏ పీవోలు వి.అభిషేక్‌, కె.సింహాచలం, అపూర్వభరత్‌, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ కల్పశ్రీ), జిల్లా పర్యాటకాధికారి జి.దాసు, గిరిజన మ్యూజియం మేనేజర్‌ మురళీకృష్ణ, టూరిజం కన్సల్టెంట్‌ రత్నరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 11:48 PM