ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జోరుగా విమానయానం

ABN, Publish Date - Nov 17 , 2024 | 01:19 AM

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

  • భారీగా పెరిగిన ప్రయాణికులు

  • ఢిల్లీ, హైదరాబాద్‌లకు భలే డిమాండ్‌

  • 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ

  • సింగపూర్‌ విమానానికి 75.22 శాతం ఆక్యుపెన్సీ

  • గత ఏడాది అక్టోబరుతో పోల్చితే ఈ ఏడాది అక్టోబరులో అన్ని రకాలుగా వృద్ధి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతిరోజూ 32 సర్వీసులు అటుఇటు తిరుగుతుండగా వాటిలో ఎనిమిది వేల మంది ప్రయాణిస్తున్నారు. నెలకు ప్రయాణించే వారి సంఖ్య 2.5 లక్షలు దాటింది. ఏయే నగరాలకు వెళ్లే విమానాలు రద్దీగా ఉంటున్నాయనేది పరిశీలిస్తే...దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. గత అక్టోబరు నెలలో ఢిల్లీ వెళ్లే విమానాల్లో 26,692 సీట్లు అందుబాటులో ఉండగా...22,879 మంది ప్రయాణించారు. అంటే 85.71 శాతం ఆక్యుపెన్సీ ఉంది. విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే వాటిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

ఢిల్లీ తరువాత స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. అక్టోబరు నెలలో విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే విమానాల్లో 50,383 సీట్లు అందుబాటులో ఉండగా...వాటిలో 40,632 మంది ప్రయాణించారు. ఆక్యుపెన్సీ రేటు 80.64 శాతంగా నమోదైంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మూడో స్థానంలో నిలిచింది. ఆ నగరానికి 11,102 సీట్లు అందుబాటులో ఉండగా 8,877 సీట్లు ప్రయాణికులు వినియోగించుకున్నారు. గ్రీన్‌ సిటీ బెంగళూరుకు విశాఖ నుంచి 28,192 సీట్లు అందుబాటులో ఉండగా, 21,569 మంది ప్రయాణం చేశారు. ఆక్యుపెన్సీ 76.5 శాతంగా నమోదైంది. ఇక విశాఖపట్నం నుంచి చెన్నై నగరానికి 16,716 సీట్లు అందుబాటులో ఉండగా 11,791 మంది ప్రయాణించారు. ఆక్యుపెన్సీ రేటు 70.53 శాతం నమోదైంది.

విశాఖ నుంచి సింగపూర్‌, మలేషియా, బ్యాంకాక్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండగా సింగపూర్‌ విమానం అక్టోబరులో దేశీయ సర్వీస్‌లకు తీసిపోకుండా 75.22 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. మొత్తం 3,165 సీట్లు అందుబాటులో ఉండగా 2,381 మంది ప్రయాణించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 2023 అక్టోబరులో 2,32,004 మంది ప్రయాణం చేయగా, ఈ ఏడాది అక్టోబరులో 2,52,499 మంది (8.83 శాతం ఎక్కువ) రాకపోకలు సాగించారు.

విమానాల లెక్కలు పరిశీలిస్తే గత ఏడాది అక్టోబరులో విశాఖ నుంచి 1,732 విమానాలు నడవగా, ఈ ఏడాది అక్టోబరులో 1,855 విమానాలు నడిచాయి. వీటిలో 7.1 శాతం వృద్ధి నమోదైంది.

వింటర్‌ షెడ్యూల్‌లో మరో మూడు సర్వీస్‌లు

రాజారెడ్డి, విమానాశ్రయం డైరెక్టర్‌

అక్టోబరు 28వ తేదీ నుంచి కొత్త వింటర్‌ షెడ్యూల్‌ అమలులోకి వచ్చింది. అంతకు ముందు రోజుకు 32 విమానాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు మరో మూడు పెరిగాయి. అంటే ఇటు నుంచి వెళ్లేవి 35 అయితే, అటు నుంచి వచ్చేవి మరో 35. రోజుకు 70 విమానాల కింద లెక్క. ప్రయాణికుల సంఖ్య కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతోంది.

Updated Date - Nov 17 , 2024 | 01:19 AM