ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుషికొండ బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి?

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:06 AM

రుషికొండ బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను సోమవారం నిర్వాహకులు, నిపుణులు పరిశీలించారు.

సాధ్యాసాధ్యాలు పరిశీలించిన నిర్వాహకులు, నిపుణులు

సాగర్‌నగర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

రుషికొండ బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను సోమవారం నిర్వాహకులు, నిపుణులు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్కే బీచ్‌లో సబ్‌మెరైన్‌ సమీపాన అట్టహాసంగా ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి అలల తాకిడికి ముక్కలైన విషయం తెలిసిందే. అక్కడ నిర్వహించడం సాధ్యం కాదని గుర్తించి అధికారులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈసారి రుషికొండ బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఆర్కే బీచ్‌లో విఫలం కావడంతో నిర్వాహకులు ఈసారి అత్యంత గోప్యంగా రుషికొండ బీచ్‌ను సందర్శించారు. బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. కాగా, రుషికొండ బీచ్‌లో ఇప్పటికే ఏపీటీడీసీ, ప్రైవేట్‌ సంస్థలు బోటుషికార్‌, కయాకింగ్‌, స్కూబా డ్రైవింగ్‌ వంటివి నిర్వహిస్తున్నాయి.

Updated Date - Nov 19 , 2024 | 01:06 AM