ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దువ్వాడ పూర్వపు సీఐపై ఫోర్జరీ కేసు

ABN, Publish Date - May 22 , 2024 | 01:04 AM

దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది.

కూర్మన్నపాలెం, మే 21:

దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ప్రస్తుత సీఐ ఎర్రంనాయుడు మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో టి.దేవాడలో పేకాట శిబిరాలపై స్టీల్‌ప్లాంటు సీఐ వి.శ్రీనివాసరావు, దువ్వాడ సీఐగా ఉన్న శ్రీనివాసరావు, గాజువాక ఎస్‌ఐ సతీశ్‌లు దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దువ్వాడ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. అయితే పేకాట శిబిరాలపై దాడిలో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాలసి ఉంది. దాడిలో పాల్గొన్న అధికారుల సంతకాలు ఎఫ్‌ఐఆర్‌పై లేకుండా వేరే సంతకాలతో కేసు నమోదుచేయడం వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టీల్‌ప్లాంటు సీఐ వి.శ్రీనివాసరావు, గాజువాక ఎస్‌ఐ సతీశ్‌ల ఫిర్యాదు మేరకు నాడు దువ్వాడ సీఐగా ఉన్న శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎర్రంనాయుడు తెలిపారు. ప్రస్తుతం సీఐ శ్రీనివాసరావు వీఆర్‌లో ఉన్నారు.

Updated Date - May 22 , 2024 | 08:04 AM

Advertising
Advertising