ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:22 PM

అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు.

ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన కారు

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

క్షతగాత్రుల స్వస్థలం ఖమ్మం

అనకాపల్లి టౌన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు. ఈ సంఘటనకు సంబంధించి అనకాపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ట్రాఫిక్‌ సీఐ ఎం.వెంకటనారాయణ తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఖమ్మంలోని జిల్లా పరిషత్‌ క్వార్టర్స్‌ ప్రాంతంలో నివాసం వుంటున్న అంబా అశోక్‌కుమార్‌ కుమార్తె వివాహానికి ఆయనతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖపట్నం వచ్చారు. మంగళవారం ఉదయం అంబా అశోక్‌కుమార్‌, భార్య పద్మావతి, బంధువులు పి.అన్నపూర్ణ, పి.లక్ష్మీశ్రీకరి కలిసి కాకినాడ జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రానికి కారులో వెళ్లారు. సత్యనారాయణస్వామి దర్శనం చేసుకుని తిరిగి విశాఖపట్నం వెళుతుండగా అనకాపల్లి బైపాస్‌ రోడ్డులో ‘డైట్‌’ కళాశాల సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురికీ తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్‌ రామలింగం క్షేమంగా బయటపడ్డాడు. క్షతగాత్రులకు స్థానిక ఎన్టీఆర్‌ జిల్లా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు అశోక్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటనారాయణ తెలిపారు.

Updated Date - Nov 19 , 2024 | 11:22 PM