ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుపై జీఎస్‌ఐ సర్వే

ABN, Publish Date - Aug 05 , 2024 | 11:59 PM

జీకేవీధి మండలం సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుపై జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం సోమవారం విస్తృతంగా సర్వే నిర్వహించింది.

సీలేరు, ఆగస్టు 5 : జీకేవీధి మండలం సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుపై జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం సోమవారం విస్తృతంగా సర్వే నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన జియోలాజికల్‌ సర్వే బృందం స్థానిక పంప్డ్‌ స్టోరేజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి తొమ్మిది ప్రాంతాలను సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యాప్‌కోస్‌ సంస్థ తయారు చేసిన డీపీఆర్‌ ఆధారంగా పరిశీలన చేసింది. ఇందులో జలవిద్యుత్‌ కేంద్రం నిర్మించే పార్వతీనగర్‌, టన్నెల్‌ నిర్మించే ప్రాంతం, గుంటవాడ జలాశయం, డంపింగ్‌ యార్డు తదితర ప్రాంతాలను బృందం సందర్శించి, అక్కడ పరిస్థితిని అంచనా వేసింది. ఈ సందర్భంగా జీఎస్‌ఐ సభ్యులకు ప్రాజెక్టు గురించి ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి విపులంగా వివరించారు. కార్యక్రమంలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏడీఈ టి.అప్పలనాయుడు, తదితరులు ఫాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 11:59 PM

Advertising
Advertising
<