దీర్ఘకాలిక వ్యాధులపై ఇంటింటి సర్వే
ABN, Publish Date - May 20 , 2024 | 12:36 AM
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించేందుకు వీలుగా మరోసారి ఇంటింటి సర్వే చేపట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది.

జూలై నుంచి చేపట్టేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు
ఇప్పటికే జిల్లా ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ముగిసిన తర్ఫీదు
త్వరలో సిబ్బందికి అందనున్న శిక్షణ
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించేందుకు వీలుగా మరోసారి ఇంటింటి సర్వే చేపట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. గతంలో నాన్ కమ్యూనకబుల్ డిసీజ్ (ఎన్‌సీడీ), ఎన్‌సీడీ 2.ఓ పేరుతో సర్వే నిర్వహించిన ఆరోగ్యశాఖ.. మరో విడత ఇంటింటి సర్వేకు సిద్ధమవుతోంది. ఎన్‌సీడీ 3.ఓ పేరు జూలై మొదటి వారం నుంచి ఈ సర్వేను చేపట్టనుంది.
ఇంటింటి సర్వేలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారి ఆరో గ్య వివరాలను సేకరించనున్నారు. బీపీ, షుగర్, ఆస్ట్రియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులతోపాటు కేన్సర్‌కు స్ర్కీనింగ్ పీరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. రొమ్ము, సర్వైకల్, ఓరల్ కేన్సర్ నిర్ధారణకు సంబంధించి ఆరోగ్యశాఖ సిబ్బంది రోగుల ఇళ్ల వద్దే స్ర్కీనింగ్ చేపట్టనున్నారు. ఆరోగ్యశాఖకు చెందిన మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్‌ఎం ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తారు. రోగుల వివరాలను వీరికి కేటాయించిన యాప్‌లో పొందుపరుస్తారు. ఆయా గ్రామాల కు కేటాయించిన పీహెచ్‌సీలోని వైద్యులు (ఫ్యామిలీ ఫిజీషి యన్ కాన్సెప్ట్) రోగులు వివరాలను పరిశీలించి, అవసరమ నుకుంటే మెరుగైన పరీక్షలు, వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా రిఫరల్ ఆస్పత్రులకు, ఆరోగ్యశాఖ నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించనున్నారు.
త్వరలో సిబ్బందికి శిక్షణ
ఎన్‌సీడీ 3.ఓ సర్వే నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి లో ఒక అధికారి ఇప్పటికే శిక్షణ తీసుకుని వచ్చారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాలో సర్వే నిర్వహించనున్న ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ అందిస్తారు. ఈ నెలాఖరులోగా క్షేత్రస్థాయి లో సర్వే నిర్వహించే సిబ్బందికి శిక్షణ పూర్తి చేయనున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్‌సీడీ 3.ఓ సర్వేలో పూర్తిగా కేన్సర్‌కు సంబంధించిన అంశాలపై దృష్టిసారిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేన్సర్ స్ర్కీనింగ్ చేయడానికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా ఆదే శాలు అందాయని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
అదుపు చేయడంపైనే దృష్టి..
ఇటీవల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్న వారి సం ఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న వయసు లోనే షుగర్, బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టడం, కేన్సర్ మహమ్మారి విజృంభిస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సకాలంలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి రోగులను తప్పించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేను చేపడుతున్నాయి. దీని ద్వారా వీలైనంత వరకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని ముందుగానే గుర్తించి, మెరుగైన వైద్యసేవలు అందించేం దుకు అవకాశం ఉంటుందని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. ఈ సర్వేతో అనారోగ్య సమస్య ఉందని తెలియని ఎంతోమందిని గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆశా, ఏఎన్‌ఎం, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని డీఎంహెచ్‌వో వివరించారు.
Updated Date - May 20 , 2024 | 12:36 AM