ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

25న జిల్లా అభివృద్ధిపై ఇన్‌చార్జి మంత్రి సమీక్ష

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:18 AM

ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఈనెల 25వ తేదీన జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర్‌ ప్రసాద్‌ తెలిపారు.

అన్ని విభాగాల హెచ్‌వోడీలు పూర్తి వివరాలతో హాజరుకావాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశం

24న జడ్పీ సమావేశానికీ పక్కా నివేదికలతో రావాలని సూచన

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఈనెల 25వ తేదీన జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి హోదాలో తొలిసారి వస్తున్న ఆయన ఆరోజు మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో భేటీ అవుతారన్నారు. సోమవారం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇంకా పరిపాలనాపరమైన అంశాలపై ఇన్‌చార్జి మంత్రి చర్చిస్తారన్నారు. అన్ని విభాగాల హెచ్‌వోడీలు తమ తమ శాఖల్లో చేపట్టిన పనులపై పూర్తిస్థాయి నివేదికలతో హాజరుకావాలన్నారు. అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకోవాలని డీఆర్వోను ఆదేశించారు. అదే రోజు ఉదయం ఆనందపురం మండలం ‘సీ’ కన్వెన్షన్‌ హాలులో భీమిలి నియోజకవర్గ సమీక్ష ఉంటుందన్నారు. కాగా ఈనెల 24వ తేదీన జరగనున్న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి పక్కా నివేదికలతో అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. గతంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై చేపట్టిన చర్యలను క్షుణ్ణంగా వివరించాలన్నారు. సమావేశం నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు.

ముగిసిన టెట్‌

పరీక్షకు 85.63 శాతం మంది హాజరు

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణ సోమవారంతో ముగిసింది. ఈ పరీక్షలు ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో ఈనెల మూడో తేదీన ప్రారంభమయ్యాయి. మొత్తం 60,547 మందికి హాల్‌ టిక్కెట్లు జారీచేయగా 51,847 (85.63 శాతం) మంది హాజరైనట్టు డీఈవో చంద్రకళ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించింది. దీనికి అనుగుణంగా టెట్‌ నిర్వహించింది. ఫలితాలు త్వరగా వెల్లడించి అనంతరం డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:18 AM