ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు భూముల పరిశీలన

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:49 PM

సీలేరులో నిర్మించే 1,350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన భూములను గురువారం అడిషనల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు రాహుల్‌ పాండే పరిశీలించారు.

జొన్నమామిడి టేకు ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న రాహుల్‌ పాండే, జెన్‌కో అధికారులు

సర్వేలో పేర్కొన్న ప్రాంతాల్లో ఏపీసీసీఎఫ్‌ పర్యటన

సీలేరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సీలేరులో నిర్మించే 1,350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన భూములను గురువారం అడిషనల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు రాహుల్‌ పాండే పరిశీలించారు. సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణం కోసం, డంపింగ్‌యార్డు కోసం 214 హెక్టార్లలో అటవీశాఖకు సంబంధించిన భూమి అవసరముందని ఏపీ జెన్‌కో సర్వే నిర్వహించి అటవీశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు గతంలో పలు దఫాలుగా సీసీఎఫ్‌ స్థాయిలో డీజీపీఎస్‌ సర్వే, డీమార్కేషన్‌, ఎసెస్‌మెంట్‌ సర్వేలు పూర్తి చేశారు. ఈ నివేదికను పీసీసీఎఫ్‌కు పంపించడంతో అందులో పేర్కొన్న అంశాలు కచ్చితంగా ఉన్నాయా?, లేదా? అని పరిశీలన నిమిత్తం ఏపీసీసీఎఫ్‌ తమ బృందంలో కలిసి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇటీవల సర్వేలో పేర్కొన్న జొన్నమామిడి, పార్వతీనగర్‌, శాండికోరి, వలసగెడ్డ ప్రాంతాలను పరిశీలించారు.

పర్యటనపై గోప్యత

అటవీశాఖ, జెన్‌కో అధికారులు పంప్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి భూముల పరిశీలన కోసం చేసిన పర్యటన విషయాలపై గోప్యత పాటించారు. స్థానిక విలేకరులకు ఆ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. మీడియాకు సమాచారం ఇవ్వవద్దని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని జెన్‌కో అధికారి ఒకరు తెలిపారు. అధికారులు పంప్డ్‌ స్టోరేజీ ప్రదేశాన్ని పరిశీలించారని రాయమని విలేకరులకు చెప్పడం చర్చనీ యాంశమైంది.

Updated Date - Nov 14 , 2024 | 11:49 PM