దీని దుంప తెగ..
ABN, Publish Date - Nov 22 , 2024 | 10:56 PM
పాడేరులో శుక్రవారం జరిగిన వారపు సంతకు ఐదు అడుగుల పొడవైన 17 కిలోల బరువైన నాగలదుంపను గిరి రైతు తీసుకువచ్చాడు.
పాడేరు సంతకు 17 కిలోల నాగల దుంప
తీసుకువచ్చిన కె.కోడాపల్లి గిరి రైతు
పాడేరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పాడేరులో శుక్రవారం జరిగిన వారపు సంతకు ఐదు అడుగుల పొడవైన 17 కిలోల బరువైన నాగలదుంపను గిరి రైతు తీసుకువచ్చాడు. సంతకు వచ్చిన వారంతా పొడవైన అధిక బరువున్న దుంపును ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం దుంపల సీజన్ కావడంతో అధిక మొత్తంలో నాగలదంపలు వచ్చాయి. అయితే 1 నుంచి 5 కిలోల బరువుండే దుంపలు రావడం సహజం. కాని అందుకు భిన్నంగా జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి పంచాయతీ కలువపూలు గ్రామానికి చెందిన రైతు ప్రసాదు తీసుకువచ్చిన నాగులదంప ఐదు అడుగుల పొడవు, 17 కిలోల బరువు ఉండడం విశేషం.
Updated Date - Nov 22 , 2024 | 10:56 PM