ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jany Master: జానీ మాస్టర్ లవ్ జిహాద్‌.. కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్

ABN, Publish Date - Sep 17 , 2024 | 08:04 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక దాడి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై జన జాగరణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ వాసు స్పందించారు. లవ్ జిహాద్‌కు పాల్పడిన జానీ మాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. జానీ మాస్టర్, ఆయన భార్య అయోషా ఇద్దరు కలిసి మహిళా డాన్స్ మాస్టర్‌ను బలవంతంగా మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు.

Jany Master

విశాఖపట్నం: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక దాడి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై జన జాగరణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ వాసు స్పందించారు. లవ్ జిహాద్‌కు పాల్పడిన జానీ మాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. జానీ మాస్టర్, ఆయన భార్య అయోషా ఇద్దరు కలిసి మహిళా డాన్స్ మాస్టర్‌ను బలవంతంగా మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. సెలబ్రిటీ ముసుగులో లవ్ జిహాద్‌కు పాల్పడిన జానీ మాస్టర్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించాలని ఆయన వాసు డిమాండ్ చేశారు. ఇటువంటి మతోన్మాదులను టాలీవుడ్ నుంచి శాశ్వతంగా బహిష్కరించి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.


ఇదీ కేసు..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(షేక్‌ జిలానీ బాషా)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆయన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రత విభాగం డీజీ శిఖా గోయెల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె సూచనల మేరకు రాయదుర్గం ఠాణాకు చేరుకుని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అయితే.. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధి కాకపోవడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. కేసును నార్సింగ్‌ ఠాణాకు బదిలీ చేశారు. నార్సింగ్‌ పోలీసులు లైంగిక దాడి, వేధింపులు, రక్తగాయాలయ్యేలా దాడి చేయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసుల కథనం ప్రకారం.. 2017లో ఓ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం రావడంతో బాధితురాలు హైదరాబాద్‌కు వచ్చారు. 2019 నుంచి జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్‌ సమయంలో అక్కడ హోటల్‌ గదిలో తనపై జానీ మాస్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలోంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దాంతో తాను మిన్నకుండిపోవడాన్ని అవకాశంగా తీసుకుని, తరచూ షూటింగ్‌ ప్రదేశాల్లో వేధించేవాడని.. వ్యానిటీ వ్యాన్‌లో తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడని వివరించారు. ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకుని దాడి చేసేవాడని.. ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై కొట్టాడని వాపోయారు. మాట వినకపోతే.. షూటింగ్‌ లొకేషన్‌లో అందరి ముందు అవమానపరిచేవాడని, అసభ్యంగా తాకేవాడని తెలిపారు. మతం మారి, తనను పెళ్లి చేసుకోవాలని హింసించేవాడని చెప్పారు.

Updated Date - Sep 17 , 2024 | 08:07 AM

Advertising
Advertising