నిండు కుండలా కోనాం జలాశయం
ABN, Publish Date - Jul 04 , 2024 | 12:19 AM
మండలంలో ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో కోనాం జలాశయానికి వర్షపు నీరు చేరడంతో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం వరకు జలాశయం ఎగువ అటవీ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో పెరుగుతోంది.
పెరిగిన నీటిమట్టం
వృథాగా పోతున్న 20 క్యూసెక్కుల నీరు
చీడికాడ, జూలై 3: మండలంలో ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో కోనాం జలాశయానికి వర్షపు నీరు చేరడంతో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం వరకు జలాశయం ఎగువ అటవీ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో పెరుగుతోంది. అయితే నీటి పారుదలశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సుమారు 20 క్యూసెక్కుల వరకు నీరు దిగువ కాలువ ద్వారా రోజూ వృథాగా పోతోంది. జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, మంగళవారం ఉదయానికి 96.10 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 80 క్యూసెక్కులు కాగా, దిగువ గేటు ద్వారా 20 క్యూసెక్కుల వరకు సాగునీరు వృథాగా కిందకు పోతుంది. కాగా గత ఏడాది ఇదే రోజునాటికి 97.30 మీటర్ల నీటిమట్టం ఉంది. జలాశయానికి కొత్తనీరు చేరుతుండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
Updated Date - Jul 04 , 2024 | 12:19 AM