ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిడుగుపాటుకు పశువులు మృతి

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:45 PM

జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం పిడుగుపాటుకు భారీ సంఖ్యలో పశువులు మృతి చెందాయి. కొయ్యూరు మండలంలో 15, గూడెంకొత్తవీధి మండలంలో ఎనిమిది, పెదబయలు మండలంలో మూడు మృత్యువాత పడ్డాయి.

కొయ్యూరు మండలం మందపల్లి సమీప అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు మృతి చెందిన పశువులు

కొయ్యూరు, జీకేవీధి, పెదబయలు మండలాల్లో 26 మృత్యువాత

మేత కోసం కొండ ప్రాంతాలకు తీసుకువెళ్లిన సమయంలో ఘటన

కొయ్యూరు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం పిడుగుపాటుకు భారీ సంఖ్యలో పశువులు మృతి చెందాయి. కొయ్యూరు మండలంలో 15, గూడెంకొత్తవీధి మండలంలో ఎనిమిది, పెదబయలు మండలంలో మూడు మృత్యువాత పడ్డాయి. పశువులను మేత కోసం కొండ ప్రాంతానికి తీసుకువెళ్లిన క్రమంలో పిడుగులు పడడంతో అవి మృతి చెందాయి.

కొయ్యూరు మండలంలో ఆదివారం ఉదయం మఠంభీమవరం పంచాయతీ మందపల్లి సమీప అటవీ ప్రాంతంలో పిడుగు పడి మేతకు వెళ్లిన 15 పశువులు మృతి చెందాయి. పశువులను మేపేందుకు అడవికి తీసుకువెళ్లిన గిరిజనులు ఆ సమయంలో సమీప బండరాయిపై ఉండడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మందపల్లి గ్రామానికి చెందిన సుమారు 60 పశువులను మేత కోసం గ్రామానికి చెందిన కొందరు మందపల్లి- కొత్తపాలెం మధ్య గల బండల కొండకు ఆదివారం ఉదయం తోలుకు వెళ్లారు. రెండు గుంపులుగా పశువులను అడవిలో మేతకు వదిలి గిరిజనులు సమీప కొండ రాయిపై విశ్రమించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. అయితే ఉన్నట్టుండి ఒక గుంపుగా మేత మేస్తున్న పశువులపై పిడుగు పడింది. దీంతో ఆ గుంపులో ఉన్న 15 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. పిడుగు పడే సమయానికి కాపరులు సమీపంలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ఎల్లవరం గ్రామంలో..

గూడెంకొత్తవీధి: మండలంలోని వంచుల పంచాయతీ ఎల్లవరం గ్రామంలో పిడుగుపాటుకు ఆరు పశువులు, రెండు మేకలు మృతి చెందాయి. ఆదివారం యథావిధిగా గ్రామ కాపరి పశువులను మేత కోసం కొండకు తీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వర్షానికి చెట్ల కింద చేరిన పశువులు, మేకలపై పిడుగు పడింది. దీంతో ఆరు పశువులు, రెండు మేకలు మృతి చెందాయి.

పెదబయలు మండలంలో..

పెదబయలు: మండలంలో ఆదివారం పిడుగుపాటుకు మూడు దుక్కి ఎద్దులు మృతి చెందాయి. సీకరి పంచాయతీ చిట్టంరాయి గ్రామానికి చెందిన పి.దేవినాయుడు, వి. అజయ్‌కుమార్‌ ఆదివారం సమీప కొండపైకి పశువులను మేతకు తోలుకెళ్లారు. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో కూడిన పిడుగుపాటుకు ఆ దుక్కి ఎద్దులు మృతి చెందాయి.

Updated Date - Oct 20 , 2024 | 10:45 PM