ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:09 AM

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీప్రైవేటు ఆస్పత్రుల దోపిడీప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఎదుట ప్రైవేటు రక్త నమూనా సేకరణ కేంద్రం

ఫోటో: 14ఏకేపీ.1.

14ఏకేపీ.2. అనకాపల్లిలో వాణిజ్య సముదాయాల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు

ధనార్జనే యాజమాన్యాల ధ్యేయం

వైద్య, ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండానే వైద్యశాలలు, ల్యాబ్‌లు ఏర్పాటు

క్లినిక్‌ల మాటున పెద్ద ఆస్పత్రులు నిర్వహణ

జ్వరంతో వెళితే...పలురకాల రక్తపరీక్షలు

అడ్డగోలుగా ఫీజులు వసూలు

కొరవడిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వైద్యం పక్కా వ్యాపారంగా మారిపోయింది. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేవారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, చిన్నపాటి రోగానికి కూడా పలు రకాల వైద్య పరీక్షలు చేయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ అధిక శాతం మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందేందుకు మొగ్గు చూపుతుంటారు. ఇదే ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు కలిసొస్తున్నది. కొంతమంది వైద్య నిపుణులు ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రులను నడుపుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో అనుమతి పొందిన ప్రైవేటు ప్రైవేటు ఆస్పత్రులు 149, రక్త పరీక్షల లేబొరేటరీలు 69 ఉన్నాయి. కానీ అనకాపల్లితోపాటు నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట, ఎలమంచిలి, అచ్యుతాపురం, తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే ఆస్పత్రులు నడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా 350కిపైగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్టుసమాచారం. జిల్లా కేంద్రం అనకాపల్లిలో ప్రభుత్వ అనుమతులు వున్న ఆస్పత్రులు 20 లోపే ఉండగా, క్లినిక్‌లుగా రిజిస్టర్‌ చేసుకొని అనుమతి లేకుండా పెద్ద ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. ఇటువంటివి అనకాపల్లి పట్టణంలో 50 వరకు వున్నట్టు తెలిసింది.

రక్తపరీక్షల పేరుతో దోపిడీ

జ్వర బాధితులు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే రక్త పరీక్షల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకోవాలంటే ప్రత్యకంగా అనుమతులు పొందాలి. కానీ చాలా ఆస్పత్రులు ఎటువంటి అనుమతుఉలు లేకుండానే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. సాధారణ జ్వరం అయినప్పటికీ రక్త పరీక్షలతోపాటు అవసరం లేకపోయినా ఆస్పత్రులకు అనుబంఽధంగా ఉండే లేబొరేటరీల్లో స్కానింగ్‌, ఎక్స్‌రే, ఈసీజీ వంటివి చేయించుకోవాలని ప్రిస్ర్కిప్షన్‌ రాస్తున్నారు. ఈ పరీక్షలకు రూ.వందలు, రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు. ఇక ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు ప్రభుత్వ ఆస్పత్రులకు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండానే కలెక్షన్‌ సెంటర్ల పేరుతో ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లిలో ఎన్టీఆర్‌ ఆస్పత్రి పరిసరాల్లో నాలుగు రక్త నమూనా సేకరణ కేంద్రాలు సెంటర్లు వెలశాయి.

దగ్గు, జలుబు తప్ప.. ఇతర వ్యాధులతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే రక్త, మూత్ర పరీక్షలు చేయించడం పరిపాటిగా మారింది. వైరల్‌ జ్వరంతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి.. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ (రక్త కణాలు) పడిపోయాయని చెబుతున్నారు. జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాలు ఎక్కువగా సోకుతున్నాయంటూ రోగులను భయభ్రాతంతులకు గురి చేసి, ఆయా వైద్య పరీక్షలు చేయించుకునేలా రోగులపై మానసికంగా ఒత్తిడి పెంచుతున్నారు.

ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కానరాని ఫీజుల పట్టిక

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ఏ పరీక్షకు ఎంత ఫీజు తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాల పట్టికను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినికల్‌ ల్యాబ్‌లలో ఎక్కడా ఫీజు వివరాల పట్టికలు కనిపించవు. పైగా ఒక్కో రకం వైద్యానికి ఒక్కో ప్యాకేజీని నిర్ణయించి రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవల అనకాపల్లి మండలం సత్యనారాయణపురానికి చెందిన ఒక వ్యక్తి వైరల్‌ జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. రక్తపరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్లేట్‌లెట్‌లు బాగా పడిపోయాయంటూ భయాందోళనకు గురిచేసి నాలుగు రోజులు ఇన్‌పేషెంట్‌గా ఆస్పత్రిలో వుంచారు. చివరకు రూ.45 వేల బిల్లు చేతిలో పెట్టారు. ఇటువంటి దోపిడీలు ప్రైవేటు ఆస్పత్రుల్లో నిత్యకృత్యంగా మారాయి.

మల్టీ స్పెషాలిటీ పేరుతో...

జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల పేరుతో గ్రామీణుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘సూపర్‌’ రేట్లు వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్న కొంతమంది వైద్యులతో, ల్యాబ్‌ల నిర్వాహకులు కుమ్మక్కవుతున్నారు. అవసరం లేకపోయినా పలురకాల వైద్య పరీక్షలు చేయించి, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ల్యాబ్‌ ఫీజుల్లో 20 నుంచి 40 శాతం వరకు ల్యాబ్‌ నిర్వాహకులు, సంబంధిత వైద్యులకు కమిషన్‌ రూపంలో పంపుతుంటారు. ప్రైవేటు ఆస్పత్రులు, లేబొరేటరీల నిర్వాహకులు అడ్డగోలుగా రోగులను దోచుకుంటుంటే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 15 , 2024 | 01:09 AM