ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామీణ రహదారులకు మహర్దశ

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:20 PM

గ్రామీణ రహదారుల పనులు పరుగులు తీస్తున్నాయి. నిన్నటి వరకు గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డ గ్రామీణులు ప్రస్తుతం సంబరపడుతున్నారు.

పందూరులో సీసీరోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం

గత ఐదేళ్లు అధ్వాన స్థితిలో రోడ్లు

కూటమి ప్రభుత్వం రావడంతో నిధుల వరద

మండలంలో 66 రోడ్ల పనులు ప్రారంభం

ఇప్పటికే 13 రోడ్లు పూర్తి, 53 రోడ్లు పనులు చకచకా

ఆనందంలో గ్రామీణులు

కోటవురట్ల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ రహదారుల పనులు పరుగులు తీస్తున్నాయి. నిన్నటి వరకు గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డ గ్రామీణులు ప్రస్తుతం సంబరపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం అనంతరం మండలంలో రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీసీరోడ్లు, బీటీరోడ్ల పనులకు అధికారులు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పల్లె రోడ్లకు 75 శాతం జాతీయ ఉపాధి హామీ, మిగతా 25శాతం పంచాయతీ నిధులు వ్యయం చేస్తోంది. 25 శాతం నిధుల కింద మండలానికి రూ.1.88 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఎక్కువగా సీసీ రోడ్లు పనులు మంజూరయ్యాయి. రాజుపేట, రామన్నపాలెం గ్రామాల్లో సీసీరోడ్డుతోపాటు డ్రైనేజీలు మంజూరయ్యాయి. నెల రోజుల్లో 13 రోడ్ల నిర్మాణ పనులు పూర్తికాగా, మిగతా 53 రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. ఈ పనులన్నింటిని సంక్రాంతిలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ దిశగా అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. రోడ్లన్నీ పూర్తయితే సంక్రాంతికి పల్లెల రహదారులకు నూతన శోభ రానుంది. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పల్లెల రోడ్లను ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఎక్కడిక్కడ రోడ్లు అధ్వాన స్థితికి చేరి, ఆయా ప్రాంతాల ప్రజలు రాకపోకలకు అవస్థలు పడ్డారు. వర్షాలు కురిసిన సమయాల్లో అడుగు వేయలేని దుస్థితి నెలకొంది.

పనులు వేగంగా చేయిస్తున్నాం

వర్మ, మండల ఇంజనీర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా సీసీరోడ్లు పనులు వేగవంతంగా చేయిస్తున్నాం. ప్రణాళిక బద్ధంగా పనులను చేయిస్తున్నాం. ఇప్పటికే 13 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పనులను నాణ్యతతో చేయిస్తున్నాం. సంక్రాంతిలోపు పనులన్నీ పూర్తి చేయిస్తాం.

వైసీపీ పాలనలో నరకం చూశాం

పెట్ల లింగంనాయుడు, సర్పంచ్‌, బీకేపల్లి

గత వైసీపీ పాలనలో కనీసం సౌకర్యాలు కల్పించలేకపోయారు. ప్రజలకు కనీసం ముఖం చూపించ లేకపోయాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల ఎత్తుకొని తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో రూ.15.6లక్షలతో ఐదు సిమెంట్లు రోడ్లు పనులు చేయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.

Updated Date - Nov 14 , 2024 | 11:20 PM