కార్మికులపై యాజమాన్యం వైఖరి మారాలి
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:49 AM
స్టీల్‌ప్లాంట్ కార్మికులపై యాజమాన్యం వ్యవహరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని సీఐటీయూ ప్లాంట్ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ అన్నారు.
సీఐటీయూ స్టీల్‌ప్లాంట్ గౌరధ్యక్షుడు జె.అయోధ్యరామ్
ఉక్కుటౌన్‌షిప్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్ కార్మికులపై యాజమాన్యం వ్యవహరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని సీఐటీయూ ప్లాంట్ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ అన్నారు. ప్లాంటులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, ఉక్కు యాజమాన్యం ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పిస్తే కార్మికులు తమ అనుభవంతో అధిక ఉత్పత్తి సాధిస్తారనే విషయం ఇప్పుడు నిరూపితమైందన్నారు. అయితే కార్మిక వర్గాన్ని మాత్రం ఆర్థికంగా కుంగదీసేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, కేంద్రం కక్ష కట్టిడం దారుణమన్నారు. జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు పట్టుగొమ్మలని, అటువంటి సంస్థలను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రను ఉద్యమాల తిప్పికొడతామని అయోధ్యరామ్ పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు యు.రామస్వామి, కేఎం శ్రీనివాస్. పి.శ్రీనివాసరాజు, బి.అప్పారావు. గంగాధర్, కృష్ణమూర్తి, రాజు, సత్యనారాయణ, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 12:49 AM