ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగనన్న కాలనీలో కష్టాలెన్నో!

ABN, Publish Date - Apr 08 , 2024 | 11:41 PM

‘మండలంలోని కుసర్లపూడిలో గల జగనన్న కాలనీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్‌ సౌకర్యాలు లేవు. అన్ని వసతులు కల్పిస్తామని, ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడంతో రెండేళ్ల క్రితం అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం’ అని లబ్ధిదారులు వాపోతున్నారు.

కనీసం రోడ్డు సౌకర్యం లేని కుసర్లపూడిలోని జగనన్న కాలనీ

కుసర్లపూడిలో కనీస వసతులు కరువు

రోడ్లు, విద్యుత్‌, తాగునీరు లేక లబ్ధిదారుల అవస్థలు

అధికారుల ఒత్తిడితో అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుని ఇబ్బందులు పడుతున్నామని గగ్గోలు

రోలుగుంట, ఏప్రిల్‌ 8: ‘మండలంలోని కుసర్లపూడిలో గల జగనన్న కాలనీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్‌ సౌకర్యాలు లేవు. అన్ని వసతులు కల్పిస్తామని, ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడంతో రెండేళ్ల క్రితం అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం’ అని లబ్ధిదారులు వాపోతున్నారు.

మండలంలోని కుసర్లపూడి గ్రామ శివారున మెట్టను ఆనుకుని 34 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అధికారులు లేఅవుట్‌ను చదును చేయకుండా నిర్మాణానికి అనువుగా లేని మెట్ట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయడానికి మొదట్లో విద్యుత్‌ శాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే స్తంభాలు వేయడానికి వీలు పడడం లేదని అప్పటి నుంచి వదిలేశారు. అలాగే రూ.10 లక్షలతో మంచినీళ్ల ట్యాంకు నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేశారు. కాగా ఇప్పటి వరకు కాలనీలో రోడ్లు నిర్మించలేదు. దీని వల్ల ఇళ్ల నిర్మాణానికి సామగ్రి తెచ్చుకోవడం లబ్ధిదారులకు కష్టంగా మారింది. అయితే మౌలిక వసతులు కల్పించకుండా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదట్లో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం, అధికారులు తీవ్ర ఒత్తిడి తేవడంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. మొత్తం లబ్ధిదారుల్లో 20 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోగా, మిగతా 14 మందికి చెందిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొంత మంది పునాది తీసి వదిలేశారు. అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు ఎటువంటి సౌకర్యాలు లేని ఆ కాలనీలో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడి సమస్యలపై పలుమార్లు అధికారులకు మొర పెట్టుకున్నా స్పందించడం లేదని వారు వాపోతున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:41 PM

Advertising
Advertising