ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తగరంపూడికి జాతీయ పురస్కారం

ABN, Publish Date - Dec 07 , 2024 | 01:18 AM

కేంద్ర ప్రభుత్వ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారానికి అనకాపల్లి మండలం తగరంపూడి పంచాయతీ ఎంపికైంది. పచ్చదనం-పరిశుభ్రత విభాగంలో జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్టు అధికారులు వెల్లడించారు. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుతోపాటు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టడంలో ఈ పంచాయతీ ముందుంది. సంపద తయారీ కేంద్రంలో వ్యర్థాల నిర్వహణ ఆదర్శనీయంగా నిలిచింది. గ్రామస్థులతోపాటు ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే పురస్కారానికి ఎంపికైందని ఇటీవల వరకు ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఎస్తేరు తెలిపారు.

తగరంపూడి పంచాయతీ కార్యాలయం

పచ్చదనం-పరిశుభ్రత విభాగంలో ఎంపిక

కొత్తూరు (అనకాపల్లి), డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారానికి అనకాపల్లి మండలం తగరంపూడి పంచాయతీ ఎంపికైంది. పచ్చదనం-పరిశుభ్రత విభాగంలో జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్టు అధికారులు వెల్లడించారు. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుతోపాటు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టడంలో ఈ పంచాయతీ ముందుంది. సంపద తయారీ కేంద్రంలో వ్యర్థాల నిర్వహణ ఆదర్శనీయంగా నిలిచింది. గ్రామస్థులతోపాటు ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే పురస్కారానికి ఎంపికైందని ఇటీవల వరకు ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఎస్తేరు తెలిపారు.

పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

యాదగిరి అప్పారావు, సర్పంచ్‌, తగరంపూడి

పచ్చదనం పరిశ్రభతపై జాతీయ స్థాయి పురస్కారానికి మా పంచాయతీ ఎంపిక కావడంఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అవార్డుతోపాటు ఇచ్చే రూ.కోటితో పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. చెత్త తరలించడానికి బ్యాటరీతో నడిచే వాహనాలు కొనుగోలు చేసి, ఒక పార్కును నిర్మించుకుంటాం.

ఏి్లా కలెక్టర్‌ అభినందనలు

అనకాపల్లి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలు దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌కు ఎంపికయ్యాయని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 11వ తేదీన న్యూఢిల్లీలో జరిగే జాతీయ గ్రామ పంచాయతీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయా పంచాయతీలకు పురస్కారాలు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి నక్కపల్లి మండలం డీఎల్‌ పురం, న్యాయంపూడి, అనకాపల్లి మండలం తగరంపూడి, తుమ్మపాల గ్రామ పంచాయతీలు రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికకాగా వీటిలో న్యాయంపూడి, తగరంపూడి పంచాయతీలు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యాని వెల్లడించారు. న్యాయంపూడి పంచాయతీ నీటి సరఫరా విభాగంలో, తగరంపూడి పంచాయతీ పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో ఎంపికైనట్టు తెలిపారు. జాతీయస్థాయి పురస్కారాలకు రాష్ట్రం నుంచి నాలుగు పంచాయతీలు ఎంపిక కాగా అందులో అనకాపల్లి జిల్లాకు చెందిన రెండు పంచాయతీలు ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, ఇతర అధికారులను కలెక్టర్‌ అభినందించారు.

Updated Date - Dec 07 , 2024 | 01:18 AM