నేవీ రిటైర్డు ఉద్యోగి ఆత్మహత్య
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:06 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీహరిపురం వీటీ కాలేజీ రోడ్డులో నివాసం ఉంటున్న నేవీ రిటైర్డు ఉద్యోగి సందీప్ (35) జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో ఇబ్బందులు, అన్నదమ్ములతో ఆస్తి వివాదాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మల్కాపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీహరిపురం వీటీ కాలేజీ రోడ్డులో నివాసం ఉంటున్న నేవీ రిటైర్డు ఉద్యోగి సందీప్ (35) జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో ఇబ్బందులు, అన్నదమ్ములతో ఆస్తి వివాదాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బయటకు వెళ్లిన భార్య వచ్చి ఎంతసేపు తలుపులు కొట్టినా సందీప్ నుంచి స్పందన లేకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచి చూసేసరికి బెడ్ రూమ్‌లో భర్త ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే ఆమె మల్కాపురం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Nov 17 , 2024 | 12:06 AM