ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ స్టేషన్‌కు ఎన్‌ఎస్‌జీ-1 గుర్తింపు

ABN, Publish Date - Sep 13 , 2024 | 12:58 AM

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను నాన్‌ సబర్బన్‌ గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)-1లో చేర్చాలని కేంద్ర రైల్వే బోర్డు తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్‌ ఎన్‌ఎస్‌జీ-2లో ఉంది. ఏడాదికి రూ.500 కోట్లకు పైగా ఆదాయం, రెండు కోట్ల మంది ప్రయాణిస్తే ఆ స్టేషన్‌ను ఎన్‌ఎస్‌జీ-1లో చేరుస్తారు.

ప్రతిపాదించిన కేంద్ర రైల్వే బోర్డు

ఆమోదం లభిస్తే మరిన్ని

ఆధునిక వసతులు, సౌకర్యాలు, రైళ్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను నాన్‌ సబర్బన్‌ గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)-1లో చేర్చాలని కేంద్ర రైల్వే బోర్డు తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్‌ ఎన్‌ఎస్‌జీ-2లో ఉంది. ఏడాదికి రూ.500 కోట్లకు పైగా ఆదాయం, రెండు కోట్ల మంది ప్రయాణిస్తే ఆ స్టేషన్‌ను ఎన్‌ఎస్‌జీ-1లో చేరుస్తారు. విశాఖ రైల్వేస్టేషన్‌ 2023-24లో గణనీయమైన ప్రగతిని సాధించింది. స్టేషన్‌ ఆదాయం రూ.5,641.66 కోట్లు కాగా అందులో రిజర్వ్‌డ్‌ ప్రయాణికుల నుంచే రూ.678.81 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ తరహా ఆదాయం చాలా కాలంగా వస్తున్నా ప్రయాణికుల సంఖ్య రెండు కోట్లకు చేరలేదనే కారణంతో ఇప్పటివరకూ దీనిని ఎన్‌ఎస్‌జీ-2లో కొనసాగిస్తున్నారు. భువనేశ్వర్‌ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా జోన్‌లో ఎక్కువ ఆదాయం సాధించే స్టేషన్లు 20 వరకు ఉండగా వాటన్నింటిలో విశాఖపట్నమే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో రైల్వే బోర్డు ఎన్‌ఎస్‌జీ-1లో చేర్చాలని ప్రతిపాదించింది.

ఏమిటి ప్రయోజనం?

ఎన్‌ఎస్‌జీ-2 నుంచి 1కి మారడం వల్ల ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న సాధారణంగా వినిపిస్తుంది. అలా మారిస్తే ఆ స్థాయికి తగినట్టుగా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తారు. అధునాతన వసతులు కల్పిస్తారు. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సదుపాయాలు అందుతాయి. వాణిజ్య పరంగా అభివృద్ధి చేస్తారు. డిమాండ్‌కు తగిన రైళ్లను నడుపుతారు. రైల్వే బోర్డు ప్రతిపాదనపై అధికార వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

Updated Date - Sep 13 , 2024 | 07:09 AM

Advertising
Advertising