ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మినీ స్టేడియం ఆక్రమణపై అధికారులు సీరియస్‌

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:58 AM

పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియం వద్ద ఆక్రమణలపై సచివాలయ సిబ్బందిపై టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆక్రమణలపై మునిసిపల్‌ కమిషనర్‌ రవిబాబుకు చాల ఫిర్యాదులు అందడంతో టీపీవో శుక్రవారం మినీ స్టేడియం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయ్యప్పస్వామి గుడి పక్కన స్టేడియం స్థలం ఆక్రమించి పూజా సామగ్రి దుకాణం భారీగా ఏర్పాటు చేయడంపై సంబంధిత వ్యక్తిని నిలదీశారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి సాయంత్రంలోగా ఆక్రమణ తొలగించాలని సచివాలయ సిబ్బందికి టీపీవో ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం ముందు మెయిన్‌ రోడ్డుని ఆనుకొని మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉండేది.

స్టేడియం స్థలంలో దుకాణం పెట్టడంపై సచివాలయ సిబ్బందిని నిలదీస్తున్న టీపీవో వెంకటేశ్వరరావు

మునిసిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదులు

టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ తనిఖీ

సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం

సాయంత్రంలోగా తొలగించాలని టీపీవో ఆదేశం

నర్సీపట్నం, జూలై 26 : పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియం వద్ద ఆక్రమణలపై సచివాలయ సిబ్బందిపై టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆక్రమణలపై మునిసిపల్‌ కమిషనర్‌ రవిబాబుకు చాల ఫిర్యాదులు అందడంతో టీపీవో శుక్రవారం మినీ స్టేడియం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయ్యప్పస్వామి గుడి పక్కన స్టేడియం స్థలం ఆక్రమించి పూజా సామగ్రి దుకాణం భారీగా ఏర్పాటు చేయడంపై సంబంధిత వ్యక్తిని నిలదీశారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి సాయంత్రంలోగా ఆక్రమణ తొలగించాలని సచివాలయ సిబ్బందికి టీపీవో ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం ముందు మెయిన్‌ రోడ్డుని ఆనుకొని మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉండేది. గత ఏడాది రోడ్డు విస్తరణలో భాగంగా మునిసిపాలిటీ దుకాణాలు పడగొట్టి రోడ్డు విస్తరణ చేశారు. ఆ సమయంలో అందరి షాపులతో పాటే పూజా సామగ్రి వ్యాపారికి సంబంధించిన దుకాణం కూడా తీసేశారు. మిగిలిన వ్యాపారులు తాత్కాలికంగా తోపుడు బండ్లు వేసుకొని మెయిన్‌ రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్నారు. పూజా సామగ్రి వ్యాపారి మాత్రం స్టేడియం లోపల తాత్కాలింగా పందిరి ఏర్పాటు చేసుకొని పూజా సామగ్రి విక్రయించుకునేవాడు. హైకోర్టులో స్టేటస్‌ కో హెచ్చరిక బోర్టు పెట్టాడు. గురువారం షాపునకు చుట్టూ ఐరన్‌ చానల్స్‌ వెల్డింగ్‌ చేయించి, రేకులు వేసి పక్కా దుకాణం ఏర్పాటు చేసుకోవడంతో మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కమిషనర్‌ ఆదేశాలతో స్టేడియంలో దుకాణం తక్షణమే తొలగించాలని టీపీవో ఆదేశించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:58 AM

Advertising
Advertising
<