22 మండలాలకు ఒక్కరే!
ABN, Publish Date - Nov 25 , 2024 | 12:15 AM
తూనికలు, కొలతల శాఖ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నది. వినియోగదారులకు సంబంధించి ఎంతో ముఖ్యమైన ఈ శాఖను అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. నర్సీపట్నంలోని తూనికలు, కొలత శాఖ డివిజన్ కార్యాలయం పరిధిలో అనకాపల్లి జిల్లాలో 11 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో 11 మండలాలు.. మొత్తం 22 మండలాలు వున్నాయి. ఇక్కడి కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ ఉండాలి. ఇన్‌స్పెక్టరు, టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే వున్నారు. ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఖాళీ ఉంది. ఇటు కార్యాలయంలో పనులు చేసుకుంటూ, అటు క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఈ ఇద్దరే వెళ్లాల్సి వస్తున్నది. పరిధి విస్తారంగా వుండడంతో తనిఖీలు అరకొరగానే సాగుతున్నాయి.
నర్సీపట్నం తూనికలు, కొలతల శాఖ పరిధిలో రెండు జిల్లాలు
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 22 మండలాలు
మొత్తం మూడు పోస్టులు
ప్రస్తుతం ఉన్నది ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే
పరిధి అధికంగా ఉండడంతో అంతంతమాత్రంగానే తనిఖీలు
తూనికలు, కొలతలు, ధరల్లో మోసపోతున్న వినియోగదారులు
నర్సీపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తూనికలు, కొలతల శాఖ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నది. వినియోగదారులకు సంబంధించి ఎంతో ముఖ్యమైన ఈ శాఖను అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. నర్సీపట్నంలోని తూనికలు, కొలత శాఖ డివిజన్ కార్యాలయం పరిధిలో అనకాపల్లి జిల్లాలో 11 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో 11 మండలాలు.. మొత్తం 22 మండలాలు వున్నాయి. ఇక్కడి కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ ఉండాలి. ఇన్‌స్పెక్టరు, టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే వున్నారు. ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఖాళీ ఉంది. ఇటు కార్యాలయంలో పనులు చేసుకుంటూ, అటు క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఈ ఇద్దరే వెళ్లాల్సి వస్తున్నది. పరిధి విస్తారంగా వుండడంతో తనిఖీలు అరకొరగానే సాగుతున్నాయి.
వినియోగదారులకు సంబంధించి ప్యాకింగ్ చేసిన ఏ వస్తువు అయినా సరే గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కు మించి అమ్మకూడదు. ప్యాకింగ్‌పై ముద్రించిన మేరకు బరువు వుండాలి. అదే విధంగా తూనిక రాళ్లు, కాటాలు, కొలతల పరికరాలు కచ్చితమైన ప్రమాణాలతో వుండాలి. వీటికి సంబంధించి కొంతమంది వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతుంటారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించడం, తూనిక రాళ్లను అరగదీయడం, ఎలక్ర్టానిక్ కాటాలను ట్యాంపరింగ్ చేయడం, కొలతల పరికరాల ఎత్తు/ లోతు తగ్గించడం వంటివి జరుగుతుంటాయి. ఇటువంటి వాటిని సామాన్య వినియోగదారులు పసిగట్టలేరు. ఇంకా రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, బస్టాండుల్లోని దుకాణాల్లో తినుబండారాలు, శీతల పానీయాలు, మినరల్ వాటర్ బాటిళ్లను ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు అమ్మడం లేదా సొంతంగా ఎక్కువ రేటు ముద్రించి అమ్మడం చేస్తుంటారు. ఇటువంటి అక్రమాలు, మోసాలను అరికట్టడానికి తూనికలు, కొలతల శాఖ అధికారులు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. తప్పుడు పనులకు పాల్పడిన వ్యాపారులకు జరిమానాలు విధించే అధికారం వుంది. అయితే తూనికలు, కొలత శాఖలో ఒక ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే వుండడంతో తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఒకవేళ దాడులకు వెళ్లి ఒక దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తుంటే.. క్షణాల్లో మిగిలిన వ్యాపారులు దుకాణాలను మూసేసి జారుకుంటున్నారు.
22 మండలాలకు ఒకే ఒక్క ఇన్‌స్పెక్టర్
నర్సీపట్నం తూనికలు, కొలతల శాఖ కార్యాలయం పరిధిలో నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, పాయకరావుపేట, కోటవురట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు వున్నాయి. నర్సీపట్నం కార్యాలయంలో మూడు పోస్టులు.. ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ మాత్రమే వున్నాయి. ప్రస్తుతం ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఖాళీగా వుంది.
ఎక్కువ పరిధితో ఇబ్బందులు
నర్సీపట్నం కార్యాలయం పరిధిలో అనకాపల్లి జిల్లాలో 4,500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,300 దుకాణాలు ఉన్నాయి. నర్సీపట్నం నుంచి సీలేరు, ముంచంగిపుట్టు, అరకులోయ వంటి ప్రాంతాలు చాలా దూరంలో వున్నాయి. ఈ ప్రాంతాల్లో తనిఖీలకు వెళ్లి సాయంత్రానికి తిరిగి నర్సీపట్నం చేరుకునేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. మహిళా అధికారి కావడంతో దూరప్రాంతాల్లో తనిఖీలకు వెళ్లిరావడం ఇబ్బందికరమే! అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 173 కేసులు, ఈ ఏడాది ఇప్పటి వరకు 160 కేసులు నమోదు చేశారు. ముంచగిపుట్టులో పాల ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు రావడంతో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ అనురాధ ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన అక్కడకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
Updated Date - Nov 25 , 2024 | 12:15 AM