ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమగ్రాభివృద్ధికి బాటలు!

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:26 AM

జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడమే కాకుండా పనులు వేగంగా జరిపిస్తున్నది.

  • జిల్లాలో 1,427 రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

  • ఉపాధి హామీ పథకం కన్వర్జెనీ నిధులు రూ.127.93 కోట్లు మంజూరు

  • చురుగ్గా సాగుతున్న సీసీ, తారు రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం

  • ఇప్పటికే 456 పనులు పూర్తి

  • ఈ నెలాఖరునాటికి పూర్తిచేయాలని లక్ష్యం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి):

జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడమే కాకుండా పనులు వేగంగా జరిపిస్తున్నది. దీంతో మరో నెల రోజుల్లో గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి.

ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన వైసీసీ నేతలు గ్రామీణ రోడ్ల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. రహదారులు ఎక్కడికక్కడ ఛిద్రమై కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారడంతోపాటు గోతుల్లో నీరు చేరి పంట కుంటలను తలపించేవి. అధ్వాన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు అష్టకష్టాలు పడేవారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ నాటి వైసీపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ రహదారులను బాగు చేయాలని నిర్ణయించించింది. సంక్రాంతి పండుగనాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి అధికారుల నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దీంతో జిల్లాలో అధ్వాన రోడ్లను గుర్తించి చకచకా పనులు చేయిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లపై గోతులను పూడ్చడంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో 1,427 రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.127.93 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.113.94 కోట్లతో 148 కిలోమీటర్ల పొడవున సిమెంట్‌ రోడ్లు, 12 కిలోమీటర్ల మేర 10 తారు రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు, పాత రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. జిల్లాలో ఇంతవరకు 1,036 పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో 456 పనులు పూర్తికాగా మిగిలిన పనులు చురుగ్గా సాగుతున్నాయని డ్వామా పీడీ పూర్ణిమదేవి తెలిపారు.

ఈ నెలాఖరుకు రోడ్ల పనులు పూర్తి

- వీరన్నాయుడు, జిల్లా ఇంజినీరింగ్‌ అధికారి, పంచాయతీరాజ్‌

జిల్లాలో ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో గ్రామాల్లో సిమెంట్‌, తారు రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నిర్మాణ పనులు నామినేషన్‌ పద్ధతిపై స్థానికులతో చేయిస్తున్నాం. నిధుల కొరత లేదు. సంక్రాంతి నాటికి రోడ్లు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అంతకన్నా ముందుగానే పనులు పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నాం.

Updated Date - Dec 03 , 2024 | 01:26 AM