ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీర్థయాత్రల రైళ్లు ఫుల్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:10 AM

శబరిమలై, తిరుమల, షిర్డీ రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. మండల దర్శనాలు ప్రారంభం కావడంతో ఎర్నాకులం వరకూ వెళ్లే రైళ్లకు తాకిడి పెరిగింది. ఎర్నాకులం రైళ్లకు జనవరి 19 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు. అలాగే షిర్డీ వెళ్లే సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు (18503) జనవరి 16 వరకు, తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు (17488) డిసెంబరు నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. ఆ మూడు ప్రాంతాలకు విశాఖ మీదుగా నడిచే వారాంతపు రైళ్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

ఎర్నాకులం వైపు వెళ్లే రైళ్లలో

జనవరి 19 వరకూ బెర్తులు లభించని పరిస్థితి

ప్రత్యేక రైళ్లు నడపాలని అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి

షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 16 వరకు ఖాళీల్లేవ్‌

తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 28 వరకు డిమాండ్‌

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

శబరిమలై, తిరుమల, షిర్డీ రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. మండల దర్శనాలు ప్రారంభం కావడంతో ఎర్నాకులం వరకూ వెళ్లే రైళ్లకు తాకిడి పెరిగింది. ఎర్నాకులం రైళ్లకు జనవరి 19 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు. అలాగే షిర్డీ వెళ్లే సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు (18503) జనవరి 16 వరకు, తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు (17488) డిసెంబరు నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. ఆ మూడు ప్రాంతాలకు విశాఖ మీదుగా నడిచే వారాంతపు రైళ్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

శబరిమలై రైళ్లకు జనవరి 19 వరకు ఫుల్‌

విశాఖ నుంచి కొల్లాం ఒకే స్థిరమైన రైలు (వారాంతపు) మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో అయ్యప్ప భక్తులు ఎర్నాకులం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి గురువారం విశాఖ నుంచి కొల్లాం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ (18567)కు జనవరి 16 వరకు బెర్తులు నిండిపోయాయి. విశాఖ మీదుగా రోజూ నడిచే ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351), టాటా-ఎర్నాకులం (18189), డిబ్రుగర్‌-కన్యాకుమారి వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22504)లలో జనవరి 19 వరకు బెర్తులు ఖాళీల్లేవు. అలాగే వారాంతపు, వారానికి రెండుసార్లు నడిచే రైళ్లు షాలిమార్‌-త్రివేండ్రం (22642), పాట్నా-ఎర్నాకులం (22644), షాలిమార్‌-నాగర్‌కోయిల్‌ గురుదేవ్‌ (12660), సిలిచర్‌-త్రివేండ్రం (12508), హటియా-ఎర్నాకులం (22837) రైళ్లలో జనవరి 20 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు.

ఈ ఏడాది గణనీయంగా పెరిగిన అయ్యప్ప మాలధారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శబరిమలైకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడంలో తూర్పుకోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ అధికారులు అంతగా ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లే అయ్యప్ప భక్తుల అవసరాలపై దృష్టిసారించకుండా ఒకే ఒక ప్రత్యేక రైలును ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు. 08539 నంబరుతో ప్రతి బుధవారం అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక రైలు కూడా నవంబరు 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం 18 ప్రత్యేక రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టారు. వాల్తేరు రైల్వే అధికారులు ఆ విషయం గమనించి అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం జనవరి వరకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

షిర్డీ రైలుకు డిసెంబరు వరకు బెర్తులు ఫుల్‌

ప్రతి గురువారం విశాఖలో బయలుదేరే సాయినగర్‌ షిర్డీ వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ (18503)కు మరింత డిమాండ్‌ ఏర్పడింది. విశాఖ నుంచి నేరుగా షిర్డీ చేరేందుకు ఉన్న ఏకైక రైలు కావడంతో ఫిబ్రవరి 6 వరకు బెర్తులు నిండిపోయాయి. అయితే జనవరి 2, 9 తేదీల్లో ఆర్‌ఏసీలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. షిర్డీ సాయి దర్శనానికి వెళ్లేవారికి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకునే విశాఖ-ఎల్‌టీటీ వయా రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (22847)కు డిసెంబరు 22 తర్వాత బెర్తులు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు విశాఖ-ఎల్‌టీటీ వయా సికింద్రాబాద్‌ (18519), కోణార్క్‌ (11020) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మన్మాడ్‌ వరకు వెళ్లే అవకాశం ఉన్నా షిర్డీ భక్తులు ఆసక్తి చూపడం లేదు. కుటుంబ సమేతంగా షిర్డీ వెళ్లేవారికి వారానికి ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉన్న షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503) అనుకూలంగా ఉన్న నేపథ్యంలో షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను బైవీక్లీగా నడపాలని డిమాండ్‌ కూడా చాలాకాలం నుంచి ఉంది. రైల్వే అధికారులు దృష్టి సారించి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను బై వీక్లీగా మార్చాలని కోరుతున్నారు.

తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు డిసెంబరు నెలాఖరు వరకు ఫుల్‌

తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 28 వరకు అన్ని తరగతుల బెర్తులు నిండిపోయాయి. డిసెంబరు 30, 31 తేదీల్లో ఫస్ట్‌ ఏసీలో కొన్ని బెర్తులు, జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులు కూడా ఏసీ బెర్తులు మాత్రమే లభిస్తున్నాయి. ప్రతి శనివారం భువనేశ్వర్‌లో బయలుదేరి విశాఖ మీదుగా తిరుపతి వెళ్లే భువనేశ్వర్‌-తిరుపతి (22879)లో జనవరి 18 వరకు, ప్రతి ఆదివారం విశాఖ మీదుగా భువనేశ్వర్‌ నుంచి తిరుపతి వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22871)కు జనవరి 5 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు. విశాఖ మీదుగా ప్రతిరోజు నడిచే హౌరా-యశ్వంత్‌పూర్‌ (12863) ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఖరగ్‌పూర్‌ -విల్లుపురం (22603), వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22815), పురిలియా-విల్లుపురం (22605), పూరి-తిరుపతి (17479), బిలాస్‌పూర్‌-తిరుపతి (17481), హటియా-బెంగళూరు (18637), భువనేశ్వర్‌-బెంగళూరు (12845), హౌరా-తిరుపతి హంసఫర్‌ (20889), సంత్రాగచ్చి-తిరుపతి (22855) వంటి వారాంతపు, బైవీక్లీ రైళ్లకు డిమాండ్‌ నెలకొంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విశాఖ నుంచి బయలుదేరే డబల్‌ డెక్కర్‌ (22707) ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Nov 21 , 2024 | 01:10 AM