ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండో రోజూ ప్రజాదర్బార్‌

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:26 AM

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ శనివారం కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

వినతలు స్వీకరించిన మంత్రి నారా లోకేశ్‌

తమను క్రమబద్ధీకరించాలని కోరిన 1998 డీఎస్సీ ఉపాధ్యాయులు

వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటుచేయాలని కోరిన నాయీ బ్రాహ్మణులు

అనంతరం అక్కయ్యపాలెం ప్రాంతంలో అంగన్‌వాడీ కేంద్రం సందర్శన

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ శనివారం కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

మా పాలిట దేవుడవయ్యా..

ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ కుమారుడిని పోలీసుల సాయంతో తమకు అప్పగించిన లోకేశ్‌కు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం బొద్దూరుకు చెందిన వావిలపల్లి వేణుగోపాలరావు, హేమలత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. తమ పాలిట దేవుడువంటూ కొనియాడారు. నిరుపేద కుటుంబం కావడంతో ఉపాధికి సాయపడాలని కోరగా...అందుకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. కూలిపనులు చేసుకునే వేణుగోపాలరావు దంపతులకు ముగ్గురు కుమారులు. బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న వారి కుమారుడు చైతన్యనాయుడు ఒకరోజు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం లోకేశ్‌ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వినతిపత్రం అందజేశారు. దీంతో పోలీసులు రంగంలోకి చైతన్యనాయుడు ఫొటోతో పోస్టర్లు అతికించి గాలింపు చేపట్టారు. చివరకు హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

1998 డీఎస్సీ ఎంటీఎస్‌ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఇంకా తమకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని నాయీ బ్రాహ్మణులు కోరారు. దివ్యాంగురాలైన తన కుమార్తెకు గత ప్రభుత్వం పింఛన్‌ నిలిపివేసిందని, తిరిగి పునరుద్ధరించాలని నగరానికి చెందిన పుక్కళ్ల అప్పలరాజు కోరారు. ఆయా సమస్యలను పరిశీలించిన లోకేశ్‌ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రంథాలయం తీయకపోవడంపై అసంతృప్తి

కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించిన అనంతరం ఆయన నగరంలో విద్యా సంస్థల తనిఖీకి బయలుదేరారు. మార్గమధ్యంలో అక్కయ్యపాలెం నెహ్రూ బజార్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం వద్ద ఆగారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన గ్రంథాలయం 9-45 గంటలకు కూడా మూసి ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల పర్యవేక్షణకు ఒక ప్రత్యేకాధికారిని నియమించనున్నట్టు చెప్పారు.

అంగన్వాడీ కేంద్రం ఆకస్మిక తనిఖీ

నెహ్రూ బజార్‌ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, జీవీఎంసీ ప్రాఽథమిక పాఠశాలను మంత్రి లోకేశ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని బాలలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ఏబీసీడీలు, రైమ్స్‌ వచ్చా?...అని అడగ్గా వారు ఆడుతూ, పాడుతూ సమాధానాలిచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరా తీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి వారితో కలిసి ఫొటో దిగారు.

Updated Date - Oct 20 , 2024 | 01:26 AM