ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏయూపై ఒత్తిళ్లు!

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:12 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు అధికార పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి.

  • పోస్టింగ్‌ల కోసం కూటమి నేతలతో పైరవీలు

  • ఎగ్జామినేషన్‌ విభాగంలో కీలకస్థానానికి పావులు కదుపుతున్న ఉద్యోగి

  • వివరాలు తెలుసుకోకుండా సిఫారసు చేసిన టీడీపీ సీనియర్‌ నేత

  • ఆ ఉద్యోగి రెగ్యులర్‌ కాదని, ఆరోపణలున్నాయి తేల్చిన అధికారులు

  • ఇంజనీరింగ్‌ విభాగంలో డీఈ పోస్టు కోసం మరొకరి ఆరాటం

  • పది మంది మంత్రులతో ఉన్నతాధికారులకు ఫోన్లు

  • కంటైనర్‌ దుకాణాల తొలగింపునకూ ఎమ్మెల్యేల మోకాలడ్డు!

  • తల పట్టుకుంటున్న వర్సిటీ ఉన్నతాధికారులు

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు అధికార పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతున్నారు. గత పాలకుల నిర్ణయాల్లో మార్పులకు కసరత్తు చేస్తున్న సమయంలో అనూహ్యంగా కూటమి నేతల నుంచి ప్రతిబంధకా లు ఎదురవుతుండడం వారికి షాక్‌ కలిగిస్తోంది. దీంతో కీలక నిర్ణయాలు వాయిదా పడుతున్నట్టు సమాచారం.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఎగ్జామినే షన్‌ సెక్షన్‌లో కీలకస్థానం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇతడిపై అనేక ఫిర్యాదులున్నాయి. అడ్డగోలు గా సంపాదించాడన్న ఆరోపణలున్నాయి. పైగా రెగ్యులర్‌ ఉద్యోగి కూడా కాదు. దీంతో ఫిర్యాదులను పరిశీలించిన వర్సి టీ ఉన్నతాధికారులు అతడిని పక్కన పెట్టాలని భావించారు. అయితే ఆ ఉద్యోగి ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేనేజ్‌ చేయడంలో దిట్ట. వైసీపీ హయాంలోనూ కీలకస్థానాల్లో పనిచేశాడు. కూటమి ప్రభుత్వం రావడంతో మరోసారి తన మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను బయటకు తీశాడు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్‌ నేతతో వర్సిటీ ఉన్నతాధికారికి ఫోన్‌ చేయించి, ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో కీలకస్థానం కోసం సిఫారసు చేయించాడు. ఆ కీలకనేతకు ఉద్యోగి అసలు రూపాన్ని వర్సిటీ ఉన్నతాధికారి తెలియజేయడంతో అవాక్కయ్యారని, దీంతో అన్నీ సవ్యంగా ఉంటేనే ఇవ్వండని చెప్పినట్టు సమాచారం. అలాగే ఇంజనీరింగ్‌ విభాగంలో డీఈ పోస్టును దక్కించుకునేందుకు మరో ఉద్యోగి శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు సుమారు పది మంది మంత్రులతో సిఫారసు చేయించినట్టు చెబుతున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనను వెంటేసుకొస్తున్నారని తెలిసింది. ఈ విషయం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్యోగి ఇంజనీరింగ్‌ విభాగంలో చేరడమే నిబంధనలకు విరుద్ధమని, కీలకస్థానాన్ని కట్టబెట్టేందుకు సిఫారసులు రావ డం మరింత దారుణమని ఉన్నతాధికారులు వాపోతున్నారు.

కంటెయినర్‌ దుకాణాలకు ఎమ్మెల్యేల అండ

ఇదిలాండగా గత పాలకులు వర్సిటీలోని అనేకచోట్ల కంటైనర్‌ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఇష్టానుసారంగా అనుమతులిచ్చారు. తాజాగా అధికారులు వాటిని తొలగించేం దుకు సిద్ధమయ్యారు. అయితే వాటి జోలికివెళ్లవద్దని నగరంలోని పలువురు ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. మరికొందరు యూని యన్‌ నాయకులు కూడా తమ స్థాయిలో అధికారులపై ఒత్తి డి తెస్తున్నారు. తాము చెప్పినవారికి కీలక బాధ్యతలు అప్ప గించాలంటున్నారని చెబుతున్నారు. కొన్ని సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులను మార్చాలని, తాము చెప్పిన పోస్టింగ్‌ ఇవ్వాలని కూటమి పార్టీల అనుబంధ విభాగాల నాయకులు వర్సిటీ అధికారులను కోరుతున్నారని సమాచారం. దాదాపుగా ప్రతిరోజూ ఇదే తంతు నడుస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాలకు చెందిన నేతలు సిఫారసులు చేస్తుండడంతో పనిచేయలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది.

Updated Date - Sep 16 , 2024 | 01:12 AM

Advertising
Advertising