ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్తి పన్ను బకాయిలు 1,033.9 కోట్లు

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:58 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు బకాయిలు భారీగా పేరుకు పోతున్నాయి.

జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుతోపాటు వసూలు కావలసిన మొత్తం రూ.1423.93 కోట్లు

ఇప్పటివరకూ వచ్చింది రూ.242.85 కోట్లు మాత్రమే

మొండి బకాయిల వసూలుకు జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు బకాయిలు భారీగా పేరుకు పోతున్నాయి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు కొన్ని సక్రమంగా ఆస్తి పన్ను చెల్లించడం లేదు. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో మొండి బకాయిలు ఉండిపోయాయి. వీటిని వసూలు చేసేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రెవెన్యూ విభాగం అధికారులు ప్రత్యక్షంగా బకాయిదారులను కలిసి చర్చలు జరపాలని నిర్ణయించారు.

జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 6,13,197 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో ప్రైవేటు వ్యక్తులకు చెందినవి 5,72,002 కాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి 1,623, కేంద్ర ప్రభుత్వానికి చెందినవి 518 ఉన్నాయు. ఖాళీ స్థలాల పన్నుకు సంబంధించిన అసెస్‌మెంట్‌లు 38,154 ఉండగా, అందులో 600 అసెస్‌మెంట్లపై కోర్టులో కేసులు ఉన్నాయి. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను ద్వారా జీవీఎంసీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1423.9 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీనిలో రూ.390 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది కాగా మిగిలిన మొత్తం (రూ.1,033.9 కోట్లు) మొండి బకాయిలు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.242.85 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అందులో ప్రైవేటు అసెస్‌మెంట్ల నుంచి రూ.202. 37 కోట్లు రాగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.11.49 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.1.52 కోట్లు, కోర్టులో కేసులు ఉన్న అసెస్‌మెంట్ల నుంచి రూ.2.77 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను రూపంలో రూ.24.7 కోట్లు వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏడు సంస్థలు ఏకంగా రూ.451 కోట్లు బకాయి ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది ఎన్నిసార్లు తిరిగినా సరైన స్పందన ఉండడం లేదు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పన్నును మాత్రమే వసూలు చేయగలుగుతున్నారు. స్టీల్‌ప్లాంటు నుంచి రూ.747.48 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, అందులో రూ.722 కోట్లు పాత బకాయి. అలాగే వీఎస్‌ఈజెడ్‌ నుంచి రూ.18.53 కోట్లు, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నుంచి రూ.8.52 కోట్లు, గంగవరం పోర్టు నుంచి రూ.95 లక్షలు, పోర్టు క్వార్టర్స్‌ నుంచి రూ.59 లక్షలు, ఆదాయ పన్ను శాఖ నుంచి రూ.80 లక్షలు, వైజాగ్‌ పోర్టు నుంచి రూ.ఐదు లక్షలు వసూలు కావాల్సి ఉంది.

అలాగే ప్రైవేటు అసెస్‌మెంట్‌ల విషయానికి వస్తే మొత్తం 9,437 అసెస్‌మెంట్ల నుంచి రూ.38.4 కోట్లు రావలసి ఉంది. అత్యధికంగా మళ్ల చిన్నికృష్ణ రూ.28,16,208, పిల్ల మహలక్ష్మి రూ.10, 20,434, శేఖర్‌మంత్రి శంకరరావు రూ.9,48, 394, బొండాడ సత్యానందం రూ.8,32,246, చింత లక్ష్మీనరసమాంబ రూ.7,80,583, శారదా ఎడ్యుకేషనల్‌ ట్రస్టు రూ.7,76,883, బిల్లపాటి కాశీవిశ్వనాథం రూ.7,64,423, కొణతాల తాటప్పారావు రూ.7,47, 375, దొడ్డి కోటేశ్వరరావు రూ.6,17,021, మళ్ల నాగేశ్వరరావు రూ.5,12,791 చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర పన్నుతోపాటు బకాయిలుగా పేరుకుపోయిన మొత్తం నుంచి కూడా వీలైనంత వరకూ రాబట్టాలని జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాలకు చెందిన కార్యాలయాలకు వెళ్లి అధికారులతో మాట్లాడుతున్నారు. అలాగే ప్రైవేటు అసెస్‌మెంట్‌ల యజమానులను కూడా కలిసి బకాయిలు చెల్లించేలా వారికి కౌన్సెలింగ్‌ చేయాలని భావిస్తున్నారు. కోర్టులో కేసులు ఉన్న అసెస్‌మెంట్‌ల యజమానులతో చర్చల ద్వారా పరిష్కారానికి యత్నించాలని, వాటి నుంచి బకాయిలను రాబట్టేందుకు జీవీఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌తో సమన్వయం చేసుకోవాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.

జీవీఎంసీ పరిధిలో ఉన్న అసెస్‌మెంట్‌లు

రంగం అసెస్‌మెంట్‌లు డిమాండ్‌ వసూలైనది (కోట్లలో)

ప్రైవేటు 5,72,002 రూ.390.97 రూ.202.37

రాష్ట్రప్రభుత్వం 1,623 రూ.71.05 రూ.11.49

కేంద్రప్రభుత్వం 518 358.32 1.52

కోర్టు కేసులు 600 218.17 2.77

ఖాళీ స్థలాలు 38,454 385.37 24.7

మొత్తం 6,13,197 రూ.1423.9 రూ.242.85

----------------------------------------

అత్యధిక బకాయి ఉన్న ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు

1. స్టీల్‌ప్లాంటు రూ.722 కోట్లు

2. వీఎస్‌ఈజెడ్‌ రూ.18.53 కోట్లు

3. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే రూ.8.52 కోట్లు

4. గంగవరం పోర్టు రూ.95 లక్షలు

5. పోర్టు క్వార్టర్స్‌ రూ.59 లక్షలు

6. ఆదాయపన్నుశాఖ రూ.80 లక్షలు

Updated Date - Nov 19 , 2024 | 12:58 AM