ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా జడ్జి ధోరణిని నిరసిస్తూ న్యాయవాదుల విధుల బహిష్కరణ

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:57 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ధోరణిని నిరసిస్తూ మూడు రోజుల పాటు ప్రధాన న్యాయస్థానానికి వెళ్లకూడదని న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు.

18 నుంచి 20 వరకూ ప్రధాన న్యాయస్థానానికి వెళ్లబోమని ప్రకటన

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ధోరణిని నిరసిస్తూ మూడు రోజుల పాటు ప్రధాన న్యాయస్థానానికి వెళ్లకూడదని న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ జిల్లా ప్రధాన న్యాయస్థానాన్ని బహిష్కరించనున్నట్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్టు వారు పేర్కొన్నారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినందున ఇక్కడ హైకోర్టు బెంచ్‌ కూడా ఏర్పాటుచేయాలన్నారు. న్యాయవాదుల సంఘం కార్యదర్శి నరేశ్‌తో పాటు సీనియర్‌ న్యాయవాది కర్రి ఆదిబాబు, పెద్ద సంఖ్యలో నాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:57 AM