ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పక్కాగా ధాన్యం కొనుగోలు

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:48 AM

ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు పటిష్ట ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మొత్తం 72 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 50 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జిల్లాలో 72 సేకరణ కేంద్రాలు

రైతుల నుంచి 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం

వచ్చే నెల మొదటి వారం నుంచి సేకరణ ప్రారంభం

రైతుకు నచ్చిన రైస్‌ మిల్లుకు ధాన్యం తరలించే వెసులుబాటు

48 గంటల్లో బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ

ప్రభుత్వమే రవాణా చార్జీలు చెల్లింపు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఽఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు పటిష్ట ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మొత్తం 72 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 50 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వరి నాట్లు కాస్త ఆలస్యమైనప్పటికీ తరువాత వర్షాలు అనుకూలించడంతో పంట బాగానే పడింది. ముందస్తుగా వరినాట్లు వేసి పొలాల్లో ఇప్పటికే వరికోతలు మొదలయ్యాయి. ఈ నెలాఖరు నుంచి వరి కోతలు ఊపందుకుంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరి సాగు ఆశాజనకంగా వుండడంతో 70 వేల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో 50 రైతు సేవా కేంద్రాలు, 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. మొత్తం 72 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. డిసెంబరు మొదటి వారం నుంచి ధాన్యం సేకరిస్తారు.

వైసీపీ హయాంలో ఽధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానాపాట్లు పడ్డారు. ధాన్యం విక్రయించిన తరువాత డబ్బుల కోసం నెలల తరబడిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వుండేది. డబ్బుల గురించి స్థానిక అధికారులను అడిగితే.. తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పేవారు. ఈ నేపథ్యంలో ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అంతేకాక ధాన్యం విక్రయించే విషయంలో నిబంధనలను సులభతరళం చేసింది. ఈ మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రేడ్‌ ‘ఎ’ రకం ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం అయితే రూ.2,300కు కొనుగోలు చేస్తారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 33 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా చివరకు 17 వేల టన్నులు మాత్రమే సేకరించారు. అయితే ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురిసి, వరి సాగు బాగుండడడం, మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఖరీఫ్‌ సీజన్‌లో 50 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, గోనె సంచులను సిద్ధం చేస్తున్నారు. కల్లాల నుంచి రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించనుంది.

ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు

వైసీపీ హయాంలో ఏ రైతు, ఏ రైస్‌ మిల్లుకు ధాన్యం విక్రయించాలో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది నిర్ణయించేవారు. ఈ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని మండలాల రైతులకు 50-60 కిలోమీటర్ల దూరంలో వున్న రైస్‌ మిల్లులను కేటాయించారు. పైగా రవాణా చార్జీలను రైతులే భరించాల్సి వచ్చింది. ఈసారి అటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమకు నచ్చిన రైస్‌ మిల్లుకి ధాన్యం తరలించే వెసులుబాటు కల్పించింది. అంతే కాకుండా కొత్తగా వాట్సాప్‌ ద్వారా రైతులు ధాన్యాన్ని అమ్ముకొనే అవకాశం కల్పించనున్నారు. రైతులు తాము నిర్ణయించుకున్న రోజున ధాన్యం విక్రయించడానికి వాట్సాప్‌లో వివరాలు పంపడం ద్వారా స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

Updated Date - Nov 20 , 2024 | 12:52 AM