ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎర్రమట్టి దిబ్బల రక్షణకు గోడ

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:05 AM

భీమిలి మండలం నేరేళ్లవలస రెవెన్యూ పరిధిలో గల ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అప్పగించింది. గత నెలలో జీఎస్‌ఐ, రెవెన్యూ, గనులు, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని సర్వే చేసి సరిహద్దులను నిర్ధారించారు. ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంత?, ప్రస్తుతం ఆక్రమణకు గురైంది ఎంత అన్న వివరాలను త్వరలో జీఎస్‌ఐ విడుదల చేయనున్నది.

పశ్చిమ, ఉత్తర దిశలలో నిర్మించాలని

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సూచన

భౌగోళిక వారసత్వ సంపద పరిరక్షణ బాధ్యత

పర్యాటక శాఖకు అప్పగింత

ఆక్రమణలపై త్వరలో నివేదిక

మళ్లీ సర్వే చేయాలని కోరుతున్న భీమిలి బిల్డింగ్‌ సొసైటీ

విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):

భీమిలి మండలం నేరేళ్లవలస రెవెన్యూ పరిధిలో గల ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అప్పగించింది. గత నెలలో జీఎస్‌ఐ, రెవెన్యూ, గనులు, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని సర్వే చేసి సరిహద్దులను నిర్ధారించారు. ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంత?, ప్రస్తుతం ఆక్రమణకు గురైంది ఎంత అన్న వివరాలను త్వరలో జీఎస్‌ఐ విడుదల చేయనున్నది.

దేశంలో అత్యంత అరుదైన ఎర్రమట్టి దిబ్బల చుట్టూ ఆక్రమణలు పెరిగిపోయాయి. భీమునిపట్నం మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీకి ప్రభుత్వం ఇచ్చిన 373.95 ఎకరాల్లో 90 ఎకరాలు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతమే. ఆ స్థలంలో గత నెల సొసైటీ లేఅవుట్‌ అభివృద్ధి చేపట్టడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఎర్రమట్టి దిబ్బల సరిహద్దులు నిర్ధారించాలని జీఎస్‌ఐకు జిల్లా కలెక్టర్‌ లేఖ రాశారు. భీమిలికి నాలుగు కిలోమీటర్లు దూరంలో నైరుతి దిశగా సముద్ర మట్టానికి 10 నుంచి 90 మీటర్ల ఎత్తులో తూర్పు, పడమరలో రెండు కిలోమీటర్లు, ఉత్తర, దక్షిణంలో కిలోమీటరు విస్తీర్ణంలో అంటే 17.51’55’ నుంచి 17.52’46’ ఉత్తర అంక్షాంశంగా, 83.24’29’ నుంచి 86.26’39’ తూర్పు రేఖాంశంగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా జీఎస్‌ఐ 2014లో గుర్తించింది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2016లో గజిట్‌ విడుదల చేసింది. అయితే ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు ఆ తరువాత అటు జీఎస్‌ఐ గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ఎర్రమట్టి దిబ్బల్లో మట్టి తవ్వేశారు. అయినా రెవెన్యూ, పంచాయతీ, గనుల శాఖలు మొద్దనిద్రలో ఉండిపోయాయి. పర్యావరణ వేత్తలు అనేక పర్యాయాలు హెచ్చరించడం, చివరకు ఎన్టీటీకి ఫిర్యాదు చేయడం, ఈలోగా భీమిలి బిల్డింగ్‌ సొసైటీ తవ్వకాలు చేపట్టడంతో ఎర్రమట్టి దిబ్బలు వ్యవహారం తెరపైకి వచ్చింది. చివరకు సర్వే నిర్వహించిన జీఎస్‌ఐ ఎర్రమట్టి దిబ్బలకు పశ్చిమ, ఉత్తర దిశలలో ప్రహరీ నిర్మించి పరిరక్షించుకోవాలని పర్యాటక శాఖకు సూచించింది. తూర్పున బీచ్‌రోడ్డు, దక్షిణాన ఐఎఎన్‌ఎస్‌ కళింగ ప్రహరీ ఉన్నందున మిగిలిన దిక్కుల్లో గోడ నిర్మించాలని జీఎస్‌ఐ అధికారులు సూచించారు.

మళ్లీ సర్వే చేయండి..

ఎర్రమట్టి దిబ్బల సరిహద్దులను మరోసారి సర్వే చేసి నిర్ధారించాలని భీమిలి మ్యూచ్యువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ బల్డింగ్‌ సొసైటీ రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. గత నెలలో సర్వే నిర్వహించినప్పుడు సొసైటీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయినా ఇప్పుడు మరోసారి సర్వే చేయాలని కోరడం గమనార్హం.

Updated Date - Sep 05 , 2024 | 01:05 AM

Advertising
Advertising