ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic Day 2024: ఆర్కే బీచ్‌లో ఆకట్టుకున్న 400 మీటర్ల త్రివర్ణపతాక ప్రదర్శన

ABN, Publish Date - Jan 26 , 2024 | 09:44 AM

Andhrapradesh: నగరంలోని ఆర్కేబీచ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు.

విశాఖపట్నం, జనవరి 26: నగరంలోని ఆర్కేబీచ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic day Celebrations) ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆర్కే బీచ్‌లో భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు. అలాగే 400 మీటర్ల పొడవాటి త్రివర్ణపతాకాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) నాయకత్వంలో దేశం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. గడిచిన తొమ్మిది ఏళ్లలో ఎన్నో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసుకున్నామన్నారు. 11వ స్ధానంలో ఉన్న మన ఆర్ధిక వ్యవస్థను ఐదో స్ధానానికి తీసుకువచ్చారన్నారు. రానున్న కాలంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మనదేశం అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అభివృద్దిలో అంతా భాగస్వాములం అవుదామని జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 26 , 2024 | 09:44 AM

Advertising
Advertising