ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవకాడోపై పరిశోధనలు

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:44 PM

ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు అవకాడోపై పరిశోధనలు ప్రారంభించారు. గిరిజన ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసేందుకు ప్రయోగాత్మక సాగు చేపడుతున్నారు. ఆరు దేశ, విదేశీ రకాల మొక్కలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుని ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేశారు.

పరిశోధన స్థానంలో అవకాడో మొక్కలు

గిరిజన ప్రాంతానికి అనువైన రకాలపై అధ్యయనం

హెచ్‌ఆర్‌యూలో ఆరు దేశ, విదేశీ రకాలపై ప్రయోగాత్మక సాగు

చింతపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు అవకాడోపై పరిశోధనలు ప్రారంభించారు. గిరిజన ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసేందుకు ప్రయోగాత్మక సాగు చేపడుతున్నారు. ఆరు దేశ, విదేశీ రకాల మొక్కలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుని ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేశారు. నాణ్యత, దిగుబడి, పోషక విలువల ఆధారంగా గిరిజన ప్రాంతానికి అనువైన మేలి రకాలను ఎంపిక చేసేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు.

గిరిజన ప్రాంతానికి 2004లో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు అవకాడోను రైతులకు పరిచయం చేశారు. కాఫీ పంటకు నీడ కోసమని అవకాడో మొక్కలను చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీలో కొంత మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ మొక్కలపై సరైన అవగాహన లేకపోయినా కాఫీ బోర్డు అధికారుల ప్రోత్సాహంతో కాఫీ పంటకు నీడనిస్తుంది, కొత్తరకం పండ్లు కాస్తాయనే భావనతో రైతులు ఒక్కొక్క మొక్కను రూ.25 ధరకు కొనుగోలు చేసుకుని కాఫీ తోటల్లో నాట్లు వేసుకున్నారు. నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై పండ్ల దిగుబడినిస్తుంది. అవకాడో పండ్లకు మార్కెట్‌లోనున్న డిమాండ్‌ తెలియక సుదీర్ఘకాలంగా రైతులు పండ్లను విక్రయించలేదు. చెట్లకు కాసిన కాయలను రైతులు పట్టించుకోకపోవడం వల్ల నిరుపయోగంగా నేలరాలిపోయేవి. ఐదేళ్ల కిందట ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అవకాడో వృక్షాలు, దిగుబడిని పరిశీలించి పండ్ల విశిష్టతపై రైతులకు అవగాహన కల్పించారు. దీంతో రైతులు మార్కెటింగ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం సీజన్‌లో వర్తకులు గ్రామాలకు వచ్చి అవకాడో పండ్లను కొనుగోలు చేస్తున్నారు. గొందిపాకలు గ్రామంలో రైతుల సాగులోనున్న అవొకాడో మొక్కలు ఏపుగా పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిరిజన ప్రాంతంలో సాగును శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కొంత మంది రైతులు వ్యక్తిగతంగా అవకాడో నాట్లు వేసుకోగా, రెండేళ్లగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా అవకాడో మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ మొక్కల నుంచి మరో మూడేళ్లకు దిగుబడులు రానున్నాయి.

సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలం

జిల్లాలోని గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు అవకాడో సాగుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవకాడో సాగుకి 15-30 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండాలి. 1200-1600 మిల్లీమీటర్ల వర్షపాతంతోపాటు సముద్రమట్టానికి 800-1600 మీటర్లు ఎత్తులో ఉండాలి. ఈ వాతావరణం గిరిజన ప్రాంతంలో ఉంది. వేసవిలోనూ 25-35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షపాతం ఏడాదికి 1350-1650 మిల్లీమీటర్లు నమోదవుతుంది. ఈ మేరకు వీటి సాగుకు గిరిజన ప్రాంత వాతావరణం అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఆరు రకాలపై అధ్యయనం

ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు ఆరు దేశ, విదేశీ రకాల మొక్కలపై అధ్యయనం ప్రారంభించారు. గత ఏడాది విదేశీ రకాలపైన టీకేడీ-1, హాస్‌ మొక్కల నాట్లు వేశారు. ఈ ఏడాది పింకర్టన్‌, ఫ్యూర్ట్‌, రీడ్‌ వీదేశీ రకాలతో పాటు ఈట్టినింగ్‌ దేశీయ రకం మొక్కల నాట్లు వేశారు. ప్రస్తుతం పరిశోధన స్థానంలో ఎకరం విస్తీర్ణంలో ఐదు విదేశీ, ఒక దేశీయ రకం మొక్కలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ ఆరు రకాల్లో దిగుబడి, పండ్ల నాణ్యత, పోషక విలువలు ఆధారంగా గిరిజన ప్రాంతానికి అనువైన మేలి రకం మొక్కలను ఎంపిక చేయనున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:44 PM