ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గండిగుండం రోడ్డుకు మోక్షం

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:35 AM

ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక, నిధులు లేవనే సాకు తో గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిన గండిగుండం జంక్షన్‌ నుంచి భీమన్నదొరపాలెం రోడ్డుకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభించింది.

రూ.2 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

నాలుగు పంచాయతీల ప్రజలకు మేలు

విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):

ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక, నిధులు లేవనే సాకు తో గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిన గండిగుండం జంక్షన్‌ నుంచి భీమన్నదొరపాలెం రోడ్డుకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభించింది. పంచాయతీరాజ్‌శాఖ నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో నాలుగు పంచాయతీల ప్రజల కష్టాలు తీరనున్నాయి.

ఆనందపురం మండలంలో జాతీయ రహదారి గండి గుండం జంక్షన్‌ నుంచి భీమన్నదొరపాలెం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. విజయనగరం జిల్లా కొత్తవలస వెళ్లేందుకు వాహనదారులు ఈ రోడ్డును వినియోగిస్తారు. రామవరం, కణమాం, భీమన్నదొరపాలెం, కోలవానిపాలెం పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు ఉపయుక్తంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు మరమ్మతులకు నిధులివ్వాలని కోరుతూ ఈ ప్రాంత వాసులు పలుమార్లు ఆందోళనలు చేశారు. అయినా పాలకులు పట్టించుకోలేదు. ఈ రోడ్డులో కొత్తవలసకు వెళ్లే బస్సు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చివరకు స్థానికులు పలుదఫాలు ట్రాక్టర్లతో గ్రావెల్‌, క్రషర్‌ బుగ్గితో గోతులు పూడ్చుకోవాల్సి వచ్చింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామీణ రహదారులకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించడంతో ఈ రోడ్డుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నేపథ్యంలో రూ.2 కోట్లు మంజూరుచేశారు. త్వరలో పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారని స్థానికులు వెల్లడించారు. రోడ్డు నిర్మిస్తే వాహనదారుల కష్టాలు తీరుతాయని, మండల కేంద్రానికి చేరుకునేందుకు నాలుగు పంచాయతీల ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:35 AM